1

1

Friday 27 February 2015

ప‌క్క‌లో బ‌ల్లెంలు పెట్టుకొని జ‌ర్న‌లిస్టుల జీవితాల్లో వెలుగు ఎలా?!

తెలంగాణ ఏర్ప‌డినా తెలంగాణ జ‌ర్న‌లిస్టుల జీవితాల్లో కించిత్తు మార్పు లేదు. ఉద్య‌మ నాయ‌కుడు సీఎం అయ్యారు, ఆయ‌న ఫాలోవ‌ర్స్... ఎంత చెట్టుకు అంత గాలి అన్న‌ట్లు ఆస్వాదిస్తున్నారు. ఉద్యోగులు క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో 43 శాతం ఫిట్‌మెంట్‌తో ఆనంద‌ప‌డుతున్నారు. విద్యార్థి నాయ‌కులు కొంద‌రు చ‌ట్ట‌స‌భ‌ల్లో కొలువుదీరితే మ‌రికొంద‌రు బ్యాంకు బ్యాలెన్సుల‌తో అల‌రారుతున్నారు. కానీ ఆ ఉద్య‌మాన్ని, ఉద్యోగుల స‌క‌ల‌జ‌నుల స‌మ్మెను, చివ‌ర‌కు ఓయూలో పోలీసుల లాఠీదెబ్బ‌లు తిని విద్యార్థి నాయ‌కుల‌ను త‌యారుచేసిన జ‌ర్న‌లిస్టులు ఎక్క‌డ ఉన్నారు?. భాష్ప‌వాయు గోళాల ఘాటు వాస‌న‌లు పీల్చిన అక్ష‌ర‌యోధులు ఏ అర‌ణ్య‌వాసంలో ఉన్నారు?. తెలంగాణ వార్త‌ల కోసం యాజ‌మాన్యాల‌తో కంట‌యి బాధ‌లు ప‌డుతున్న‌వారు ఎక్క‌డున్నారు?. అవే ముఖాలు... న‌ల‌గ‌ని బ‌ట్ట‌లు, పెన్నులు ప‌ట్ట‌ని చేతులు మ‌ళ్లీ గొంతెత్తుతున్నాయి. నాయ‌కుల‌మంటూ హూంక‌రిస్తున్నాయి. కానీ కేసీఆర్ ముందు మా జ‌ర్న‌లిస్టుల జీవితాల్లో అంద‌రిలాగే వెలుగు రావాలి. అది మా హ‌క్కు అని ఎందుకు పిడికిలి బిగించ‌డంలేదు. ఎందుకంటే ఆ ముఖాల వెన‌క అస‌లు ర‌హ‌స్యాల‌న్నీ కేసీఆర్‌కు తెలుసు. అందుకే ఆయ‌న వీళ్ల‌ని లెక్క చేయ‌రు, వీళ్లు ఆయ‌న్ని నిల‌దీయ‌లేరు. ఇద్ద‌రూ బాగానే ఉన్నారు. కానీ నిజ‌మైన సామాన్య జ‌ర్న‌లిస్టు గోస ప‌డుతున్నాడు. చాలీచాల‌నీ జీతాల‌తో, ద‌శాబ్దంన‌ర‌గా కిరాయి ఇండ్ల‌లో హ‌రిగోస తీస్తున్నాడు. అయినా... మొన్న అక్రిడేష‌న్ల విధి విధానాల కోసం జ‌రిగిన క‌మిటీ స‌మావేశంలో ఒక జ‌ర్న‌లిస్టు (ఆంధ్ర ప్రాంతానికి చెందిన‌) మాట్లాడిన తీరు విడ్డూరం. మ‌న‌కు సామాజిక బాధ్య‌త ఉంది. అందుకే అన్‌లిమిటెడ్ హెల్్త కార్డు కాకుండా మ‌నం కొన్ని డ‌బ్బ‌లు క‌ట్టి, ల‌క్ష‌, రెండు ల‌క్ష‌ల హెల్్త పాల‌సీ తీసుకుంటే స‌రిపోతుంద‌ట‌. ఇందుకు మ‌రో ఆంధ్ర జ‌ర్న‌లిస్టు కూడా వంత పాడారు. నిజ‌మే... మ‌న‌కు సామాజిక బాధ్య‌త ఉంది. కానీ జేబుల ద‌మ్మిడీ లేదు. ల‌క్ష‌ల జీతాలు తీసుకునేవారికి ఏం తెలుస్తుంది... స‌గ‌టు జ‌ర్న‌లిస్టులు ప‌డే బాధ‌లు. క‌మిటీ అన్న‌పుడు అందులో ఉండే ప్ర‌తినిధులు సాధార‌ణ జ‌ర్న‌లిస్టు కోణంలో ఆలోచించాలి. కానీ అదేదో కిరీటం పెట్టుకున్న‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తే ఎలా?.
ఇంత‌కీ ఆ క‌మిటీ మీటింగులో తేల్చింది లేదు... పాడు లేదు. ఎందుకంటే ప‌దో త‌ర‌గ‌తి మెమో ఆధారంగా స్థానికత నిర్ధారిద్దామ‌ని తెలంగాణ జ‌ర్న‌లిస్టులు ప్ర‌తిపాదిస్తే... క‌మిటీలోని ఆంధ్ర జ‌ర్న‌లిస్టులు అదెలా కుదురుతుంది?. అని మోకాలు అడ్డుపెట్టార‌ట‌. పేరుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన క‌మిటీనేగానీ... మ‌న వార‌స‌త్వం, బానిస‌త్వం ఎక్క‌డ పోతుంది?. వాళ్లు చెప్పిన అభ్యంత‌రాల‌తో దిక్కుతోచ‌క త‌ర్వాత నిర్ణ‌యిద్దాం అని వాయిదా వేసుకున్నార‌ట‌. ఇంకా వెయ్యి సార్లు ఆ క‌మిటీ మీటింగు పెట్టినా ఆంధ్ర జ‌ర్న‌లిస్టుల‌ను కాద‌ని, కేవ‌లం తెలంగాణ జ‌ర్న‌లిస్టులకు మాత్ర‌మే న్యాయం జ‌రిగేలా నిర్ణ‌యం తీసుకోగ‌ల‌రా?. ప‌క్క‌లో బ‌ల్లెంలు పెట్టుకొని ఎలా ముందుకు సాగేది?. నిజంగా ఇది సిగ్గుచేటు... చంద్ర‌బాబు ద‌గ్గ‌రికి పోయి నేను ఆంధ్ర‌వాడిని అని క్లెయిమ్ చేసుకున్న వ్య‌క్తికి తెలంగాణ క‌మిటీలో చోటు క‌ల్పించిన ఈ స‌ర్కారు, జ‌ర్న‌లిస్టు సంఘాల పెద్ద‌ల‌కు హాట్సాఫ్‌!!

No comments:

Post a Comment