బాగా డబ్బున్న పెద్దోళ్లు బకాయిలు కట్టరు.. కట్టకపోతే చెత్త డబ్బాలు వాళ్ల ఇంటి ముందు పెడితే వాళ్లు హైకోర్టు వెళతారు... బకాయిలు కట్టకపోవడం హైకోర్టుకు అనాగరికంగా కనిపించదు కానీ చెత్తడబ్బాలు పెట్టడం అనాగరికం అవుతుంది.. రేపు బకాయిలు కట్టని వారికి నీళ్లు సరఫరా చేయకపోయినా, విద్యుత్ నిలిపివేసినా కూడా ఇది అనాగరికమని అంటారేమో... అయినా బకాయిలు కట్టకుండా హైకోర్టుకు వెళ్లే వారిని ఏమనాలి.. మేం తప్పు చేస్తాం మా తప్పునకు రక్షణ కల్పించండి అన్నట్లుగా హైకోర్టుకు ఎక్కిన వాడిని ఏం చేయాలో?
ఇక హైకోర్టు జీహెచ్‌ఎంసీపై మండిపడుతుందట.. అలాగే బకాయిలు కట్టని వ్యక్తిని బకాయిలు కట్టమని సూచించిందట... సూచించడం ఏంటి... మీరు బకాయిలు కట్టకుండా కోర్టుకు వచ్చినందుకు జరిమానా విధిస్తున్నాం అని చెబితే ఎంత బాగుండేది...!!
నిజంగా ఈ పెద్దోళ్లు మహా ముదుర్లుగా కనిపిస్తున్నారు... వీళ్లకు గుణపాఠం చెప్పాల్సిందే.!!
No comments:
Post a Comment