1

1

Friday, 6 February 2015

వీళ్లు అన్నీ ముందే చెబుతారు..

ఏదైనా పెద్ద సంఘ‌ట‌న చోటుచేసుకుంటే ఆంధ్ర‌జ్యోతి ముందే చెప్పింది... ఆంధ్ర‌జ్యోతి అప్పుడే రాసింది అంటారు..
తెలంగాణ వ‌స్త‌ది, తెలంగాణ రాదు, హైద‌రాబాద్ యూటీ, హైద‌రాబాద్ ఉమ్మ‌డి రాజ‌ధాని అంటూ ఓ ప‌ది ర‌కాల క‌థ‌నాలు రాసి... 
తెలంగాణ వ‌చ్చాక అప్పుడే చెప్పిన ఆంధ్ర‌జ్యోతి అంటూ ఓ క‌థ‌నాన్ని చూపించి వేసుకోవ‌డం వారికి ప‌రిపాటే..
అయితే ఆ స‌మ‌యంలో వ్య‌తిరేకంగా చెప్పిన క‌థ‌నాల ప్ర‌స్తావ‌న మాత్రం ఉటంకించ‌దు... 
ఈ పీఆర్సీ మీద కూడా రాసిన క‌థ‌నాలు కూడా అలాంటివే..
ఓసారి 27 శాతం ఫిట్‌మెంట్ అని .. ఓసారి 33 శాతం అని..
మ‌రోమారు ఉద్యోగుల‌కు చేదు క‌బురని ఎన్నో రాసింది..
ఉద్యోగుల‌ను ప్ర‌స‌న్నం చేసుకుంటేనే క‌దా ఆయా కార్యాల‌యాల్లో ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక ఉండేది..
అందుకే ఈ త‌తంగం అంతా...

No comments:

Post a Comment