1

1

Tuesday 10 February 2015

మీరు చూపిన ఒబామా రంగుల చిత్రం ఢిల్లీ వీక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయిందా?

ఢిల్లీ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఏ పార్టీతోనూ పొత్తు లేదు...
అయినా 67  సీట్లు సాధించింది...
మ‌రి బీజేపీకి మ‌హారాష్ట్ర‌లో దాదాపు ఆరు పార్టీల‌తో పొత్తు ఉంది.. అయినా మెజారిటీకీ 30 సీట్ల దూరంలో నిలిచింది..
జార్ఖండ్ లోనూ ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంది... ఆ పార్టీ మ‌ద్ద‌తు వ‌ల్లే సాధార‌ణ మెజారిటీ ల‌భించింది..
ఇక జ‌మ్మూకాశ్మీర్‌లో ఎవ‌రితో పొత్తు పెట్టుకుందో తెలియ‌దు..
హ‌ర్యానాలో ఒంట‌రిగా పోటీ చేసిందో  లేదో తెలియ‌దు..
-----------------------------
ఇక ఢిల్లీలో ఆమ్ ఆద్మీకి నితీశ్‌, మ‌మ‌త‌ల మ‌ద్ద‌తు ఉంద‌ని కొంద‌రు అంటున్నారు..
మ‌రి అదే ఢిల్లీలో సిక్కులు అధికంగా ఉన్నారు క‌దా... శిరోమ‌ణి అకాలీద‌ళ్  బీజేపీ మిత్ర‌ప‌క్ష‌మే క‌దా... వాళ్ల మ‌ద్ద‌తు బీజేపీకి ఉన్నా సిక్కుల‌ ఓట్లు పొందలేక‌పోయారా?
ఇక తెలుగు వాళ్లు గ‌ణ‌నీయంగానే ఉన్నారు.. మ‌రి మిత్ర‌ప‌క్ష‌మైన చంద్ర‌బాబు తెలుగు వారికి పిలుపునివ్వ‌లేదా?
ఇక భోజ్‌పురి న‌టుడైన ఎంపీ ఢిల్లీ నుంచే పోటీ చేసి గెలిచాడు క‌దా.. మ‌రి ఉత్త‌ర‌ప్ర‌దేశ్, బీహారీలు ఆయ‌న న‌టుడి ప్ర‌చారాన్ని న‌మ్మ‌లేదా?
ఇక హ‌ర్యానా జ‌నం ఎక్కువ‌గా ఢిల్లీలోనే ఉంటారు క‌దా.. మ‌రి మొన్న హ‌ర్యానాలో బీజేపీని గెలిపించిన వాళ్లు ఇప్పుడెందుకు ఓడించారు..
------
కేవ‌లం మ‌మ‌త‌నో, నితీశో ఎక్క‌డో ఉండి పిలుపునిస్తే ఓట‌ర్లు ప్ర‌భావితం అవుతార‌నుకుంటే.. మ‌రి ఒబామానే ర‌ప్పించి మూడు రోజుల పాటు రంగుల  సినిమా చూపించారు క‌దా..ఆ సినిమా జ‌నాన్ని మెప్పించ‌లేక‌పోయిందా?
ఆత్మ విమ‌ర్శ చేసుకోండి.. ఒక్క మోడీని అంద‌రూ క‌లిసి దెబ్బ‌తీస్తున్నార‌ని అనుకుంటే.. మొన్న‌టికి మొన్న లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో చిన్నా చిత‌క పార్టీల‌న్నింటితో క‌లిసే క‌దా మోడీ గారు ఢిల్లీ పీఠాన్ని కైవ‌సం చేసుకున్న‌ది... మొన్న‌టి ఎన్నిక‌ల్లోనూ మోడీకి మ‌ద్ద‌తుగా చాలా మంది ఓటేయాల‌ని పిలుపునిచ్చారు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ అనే న‌టుడు కూడా పిలుపునిచ్చాడు.. అంటే మోడీ సొంత శ‌క్తితో గెలిచిన‌ట్లు కాదా?  వాళ్లు ఇచ్చిన  పిలుపుల వ‌ల్లే గెలిచిన‌ట్లు భావించాలా?
ఆమ్ ఆద్మీ పార్టీ ఒంట‌రిగానే సాధించిన ఘ‌న విజ‌యాన్ని జీర్ణించుకోలేక అక్క‌సు వెళ్ల‌గ‌ట్ట‌డం ఎందుకు...?

No comments:

Post a Comment