1

1

Thursday, 19 February 2015

ఇప్పుడు మీరు చేస్తున్న ప‌నుల‌నే కాంగ్రెస్ చేసుంటే స్వాగ‌తించే వాళ్లా?

నాదో ప్ర‌శ్న‌...
ఆత్మ విమ‌ర్శ చేసుకోండి..
----------------------
తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత మ‌న తెలంగాణ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి జానారెడ్డో, పొన్నాలో ఇంకెవ‌రో ముఖ్య‌మంత్రి అయి రామోజీరావుతో స‌ఖ్యంగా ఉంటే, ఆంధ్రా పెట్టుబ‌డిదారుల‌కు, తెలంగాణ‌లోని సెటిల‌ర్ల‌కు పెద్ద పీట వేస్తుంటే... ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంలో ఉండే టీఆర్ఎస్ ఏమ‌నేది... ముమ్మాటికీ ఉద్య‌మం చేసేదా?  కాదా?   తెలంగాణ వ‌చ్చినా ఆంధ్రా దోపిడీ ఆగ‌లేద‌ని ఆందోళ‌న చేసేదే కాదా?
రామోజీ తెలంగాణ వ‌న‌రుల‌ను దోచుకున్నాడు అలాంటి వారితో స్నేహం మంచిది కాద‌ని ప్ర‌శ్నించేదా?  లేదా?   తెలంగాణ‌లో వ‌న‌రుల‌ను కొల్ల‌గొట్టే ఆంధ్రా పెట్టుబ‌డిదారుల‌కు కొమ్ముకాస్తున్న కాంగ్రెస్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో  వెయ్యి అడుగుల  లోతున గొయ్యి తీసి పాతిపెడ‌తామ‌ని అనేదా ?  అన‌క‌పోయేదా?   గురుకుల్ భూముల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తే  వ్య‌తిరేకించేవారా?  కాదా?  అక్కినేని నాగార్జున మంచోడ‌ని స‌ర్టిఫికేట్ ఇస్తే  లేదు క‌బ్జాకోరు అని మీరు మండిప‌డేవారా?  కాదా?   ప‌ద్మాల‌యా భూములు స‌క్ర‌మ‌మే అని కాంగ్రెస్ అంటే  లేదు లేదు అక్ర‌మం అని హైకోర్టుకు వెళ్లేవారా?  కాదా? మ‌న ఆత్మ‌గౌర‌వ‌న్ని తాక‌ట్టు పెడుతున్న కాంగ్రెస్‌ను ఖ‌తం చేయాల‌ని టీఆర్ఎస్‌ పిలుపు ఇచ్చేదా?  ఇవ్వ‌క‌పోయేదా?

----------------------------
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే పైన చెప్పిన ప‌నుల‌న్నీ చేస్తుంద‌నే భ‌యం, మీ 14 ఏళ్ల ఉద్య‌మ నేప‌థ్యాన్ని గుర్తించే మ‌న పార్టీ, మ‌న పాల‌న అంటూ నిఖార్సైయిన తెలంగాణ యోధులంతా రాత్ర‌న‌కా ప‌గ‌ల‌న‌కా భావ జాల వ్యాప్తి కోసం త‌మ విలువైన స‌మ‌యాన్ని వెచ్చించారు... ప్ర‌జ‌లంద‌రి కాళ్లావేళ్లా ప‌డి ఇంటి పార్టీని గెలిపించారు.. ఇప్పుడు గ్రేట‌ర్ ఎన్నిక‌ల కోస‌మ‌నో, ఇంకేదో కార‌ణం చేత‌నో మీ  ప్ర‌ధాన సిద్ధాంతాల‌కు తిలోద‌కాలు ఇస్తే భ‌విష్య‌త్తులో న‌ష్ట‌పోయేది మీతోపాటు తెలంగాణ స‌మాజం కూడా..  మీరు పెట్టుబ‌డిదారుల‌పై చూపే అతిప్రేమ ప్ర‌జ‌లలో మీపై విశ్వాసాన్ని దెబ్బ‌తీస్తున్న విష‌యాన్ని మ‌ర‌చిపోవ‌ద్దు.. 14 ఏళ్లుగా సంపాదించుకున్న విశ్వ‌స‌నీయ‌త దెబ్బ‌తింటే తిరిగి సంపాదించుకునేందుకు చాలా స‌మ‌య‌మే ప‌డుతుంది... ప్ర‌త్యామ్నాయాలు లేనంత వ‌ర‌కూ ప్ర‌జలంతా మీవెంటే ఉంటారు.. ప్ర‌త్యామ్నాయం వ‌స్తే అస్థిత్వానికే విఘాతం క‌లుగుతుంది త‌స్మాత్ జాగ్ర‌త్త‌... ఈ విష‌యాన్ని ఇంటి పార్టీ గుర్తుంచుకోవాల‌ని విజ్ఞ‌ప్తి...  !!
-------------------------------

No comments:

Post a Comment