ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ ఇప్పుడు పాలనలోనూ తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన నిపుణులను సలహాదారులుగా నియమించుకోవడం, అలాగే ఎమ్మెల్యేలకు పార్లమెంటరీ సెక్రటరీలుగా హోదా కల్పించి ఆయా మంత్రిత్వ శాఖల నిర్వహణ భారాన్ని అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన చూస్తున్నారు. ఈ పార్లమెంటరీ సెక్రటరీలు ముఖ్యమంత్రికి సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే మంత్రివర్గంలోనూ మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై విమర్శలు వస్తుండటంతో సీఎంవోలోకి నిపుణులైన మహిళలను తీసుకోవాలని యోచిస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి... మరోవైపు ఉప ముఖ్యమంత్రి పదవి ఆరోవేలుతో సమానం అని అందరూ అంటుంటే కేజ్రీవాల్ మాత్రం ఉప ముఖ్యమంత్రి పదవిని తన సన్నిహితుడు సిసోడియాకు కట్టబెట్టారు. అవినీతిపై టోల్ ఫ్రీ నెంబర్ కూడా త్వరలో ప్రకటిస్తానన్నాడు..
---------------------
ఏది ఏమైనా మహిళలను క్యాబినెట్‌లోకి తీసుకోకపోవడం, ఎమ్మెల్యేలకు పార్లమెంటరీ సెక్రటరీల హోదా కల్పించడం, ఉప ముఖ్యమంత్రి పదవి, అవినీతిపై ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ తదితర నిర్ణయాలు వింటుంటే కేసీఆర్ బాటలోనే కేజ్రీవాల్ నడుస్తున్నాడన్న అనుమానం వస్తోంది...
70 మంది ఎమ్మెల్యేలున్న ఢిల్లీ లో పార్లమెంటరీ సెక్రటరీలు ఉన్నా తప్పుపట్టరు కానీ 100 మందికి పైగా ఎమ్మెల్యేలున్న తెలంగాణలో చేస్తే తప్పుగా కనిపిస్తుంది... కేసీఆర్ ఈ నిర్ణయాలు తీసుకుంటే టీవీల్లో చర్చలు, విపక్షాల విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. కేజ్రీవాల్ తీసుకుంటే అదో విప్లవాత్మక చర్యగా ఇక్కడి మీడియా కూడా ప్రశంసిస్తుంది.. ఇదే తెలుగు జర్నలిజం దౌర్భాగ్యం..!!!
No comments:
Post a Comment