మహబూబ్‌నగర్‌లో వృద్ధాప్య పింఛన్ డబ్బులను ఇంటి పన్ను కింద జమ చేసుకుంటున్నారని వార్త వచ్చింది కొన్ని పత్రికల్లో.. వెయ్యి రూపాయల పింఛన్‌లో 850 తీసుకొని రూ.150 చేతులో పెట్టి పంపుతున్నారని వార్త సారాంశం.. ఇంటి పన్ను ఏడాదికి ఒకసారి వస్తుందా? నెలకు వస్తుందా? పన్నులు కట్టకుండా పంచాయతీలు ఎలా పనిచేస్తాయో? ఒకవేళ పంచాయతీలో అభివృద్ధి జరగకపోయినా, వ్యాధులు ప్రబలితే మళ్లా అవే పత్రికలు పడకేసిన పారిశుద్ధ్యం, పంచాయతీలకు నిధుల గండం అంటూ వార్తలు రాస్తాయి...?
----------------------
జీహెచ్ఎంసీలో మొండి బకాయిల వసూలుకు పూనుకున్నా ఇదే రకం లొల్లి... మరి మొండి బకాయిదారుల గురించి పత్రికల్లో రాయరెందుకు? మొండి బకాయిలు కడితే అభివృద్ధి పనులు నిరాటంకంగా సాగుతాయని చెప్పొచ్చు కదా..
రాజకీయ నాయకులు ఉచిత హామీల పేరిట ఓ విధంగా ప్రజలను సోమరులుగా మార్చుతుంటే పత్రికలు ప్రజలను ఇంకా బాధ్యతరహితులుగా మార్చేందుకు పూనుకుంటున్నాయేమో అనిపిస్తుంది...!!
---------------------------
నోట్: ఇవే పత్రికలు పొరుగు రాష్ట్రంలో రైతుల పొలాలను ప్రభుత్వం రాబంధువులా కబ్జా చేస్తుంటే, అక్కడి రైతులు తమ పొలాల్లో పంటలు వేసుకోవడమూ నిషేధించినా సరే కళ్లుండీ చూడలేం అన్నట్లుగా ప్రవర్తిస్తాయి.. !!
No comments:
Post a Comment