మొన్న ఖరీఫ్లో తెలంగాణలో పంటలు సాగు చేస్తున్న సమయంలో శ్రీశైలంలో నీళ్లు లేవు, సాగర్లో నీళ్లు లేవంటూ వార్తలు రాశారు... విద్యుత్ లేక పంటలు ఎండిపోతుంటే శ్రీశైలం ఖాళీ అవుతోందని గగ్గోలు పెట్టారు.. ఆ సమయంలో నీళ్లు అందక పంటలు ఎండుతున్నాయి.. విద్యుత్ ఉత్పత్తి తెలంగాణకు ఎంతో అవసరం అన్న రీతిలో వార్తలు రాయలేదు.. ఇప్పుడు మాత్రం పక్క రాష్ట్రంలో 3 లక్షల ఎకరాలకు నీళ్లు కావాలంటూ ప్రతీ ఆంధ్ర పత్రికా కూడా తెలంగాణ ఎడిషన్కు భారీ భారీ వార్తలు రాస్తున్నాయి... తెలంగాణ అవసరాలపై ఆంధ్రాకు వార్తలు రాయనప్పుడు అక్కడి ఇబ్బందులపై ఇక్కడ వార్తలు ఎందుకు వేస్తున్నట్లు..ఈ వార్తలు చూస్తుంటే ఇప్పటికీ మనం సమైక్య రాష్ట్రంలోనే ఉన్నామా? అన్నంత భావన కలుగుతోంది...
కనీసం ఆంధ్రా వాళ్లు వాటాకు మించి నీరు వాడుకున్నారన్న విషయాన్ని కూడా చెప్పడానికి ఇష్టపడటం లేదు.. 44 టీఎంసీలు అధికంగా వినియోగించుకొని మళ్లా నీళ్లు కావాలంటే ఎక్కడి నుంచి ఇస్తారో కనీసం ఆలోచించుకోరా? నీళ్లు కావాలి.. నీళ్లు కావాలి... వీలైతే శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలను కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలంటూ డిమాండ్లు, హెచ్చరికలు, బెదిరింపులు చేస్తున్నారే తప్ప న్యాయంగా మాట్లాడటం లేదు... రబీలో ఆరు తడి పంటలు వేసుకోమని రైతులకు ఎందుకు చెప్పలేదు... నీళ్లు లేనప్పుడు మార్చి వరకూ నీళ్లిస్తామని ఉత్తర కుమార ప్రగల్బాలు ఎందుకు పలికారు..? డెడ్ స్టోరేజీకి డ్యాంలు చేరాయన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా పత్రికలు చెప్పకుండా ఎందుకీ నాటకాలు?
అన్ని విషయాలూ చర్చించుకుందాం,యెవరివి వాళ్ళు న్యాయంగా పంచుకుందాం అంటే చర్చలకి రాకుండా ముఖం చాటెయ్యడం దేనికి?
ReplyDeleteసమస్యల్ని పరిష్కరించకుండా తప్పించుకు తిరిగుతూ కాలం గడిపాలనునుకున్నా ఆ సమస్యల్నే సోపానాలుగా మార్చుకుని యెదగాలనుకున్నా ఒకనాటికి అవి పోగులుపోగులుగా జమకూడి తనమెడకే వురిని సిధ్ధం చేస్తాయనేది ఆఖరి క్షణంలో గానీ తెలిసిరాదు?!