1

1

Thursday 19 February 2015

హైద‌రాబాద్‌లో ఆంధ్రా భ‌వ‌నం...!!

నా అంచ‌నా నిజ‌మైతే..
హైద‌రాబాద్‌లో ఆంధ్రా భ‌వ‌నం...!!
ట్యాంక్‌బండ్‌పై విగ్ర‌హాలు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కూ అలాగే ఉండే అవ‌కాశం..?
----------------
హైద‌రాబాద్‌లో గిరిజ‌నులు, ఆదివాసీలు, బీసీల కోసం ప్ర‌త్యేక భ‌వ‌నాలు నిర్మించేందుకు కేసీఆర్ గారు సుముఖ‌త వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే.. మొన్నామ‌ధ్య హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డ్డ కేర‌ళ వాసులు నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాల్గొంటూ మీరు మా సంస్కృతిలో మ‌మేకం అయ్యారు.. అందుకే మీకు కేర‌ళ భ‌వ‌న్ నిర్మించుకోవాడానికి ఎక‌రం స్థ‌లం ఇస్తామ‌ని హామీ ఇచ్చారు.. ఇక తెలంగాణ‌లోనూ ఏళ్ల త‌ర‌బ‌డి నివ‌సిస్తున్న ఆంధ్రా వారు కూడా ఏదైనా కార్య‌క్ర‌మాన్ని పెట్టి వ‌రం కోరితే స‌రిపోతుంది... వెంట‌నే ఆంధ్రా భ‌వ‌న‌మో లేక క‌మ్మ భ‌వ‌న‌మో లేక రెండూనూ మంజూర‌య్యే  అవ‌కాశాలు ఇప్పుడు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి...  తెలంగాణ ఉద్య‌మంలోనూ కేర‌ళ వాళ్ల క‌న్నా ఎక్కువ‌గా ఆంధ్రులు పాల్గొన్నార‌న్న ప్ర‌శంస‌ల‌ను మూట‌గ‌ట్టుకోవ‌చ్చు... మ‌రి ఆంధ్ర భ‌వ‌నానికి ఎన్ని ఎక‌రాలు కేటాయిస్తారో?
అప్ప‌ట్లో ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆంధ్రా విగ్ర‌హాలు వెన‌క్కి పంపిస్తామ‌ని కేసీఆర్‌గారు అన్నారు.. బ‌హుషా అప్పుడున్న ప‌రిస్థితుల వ‌ల్ల అలా అని ఉండొచ్చు.. ఇప్ప‌డు జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే ఆ విగ్ర‌హాల జోలికి ప్ర‌భుత్వం వెళ్లక‌పోవ‌చ్చు.. ఇత‌ర రాష్ట్రాల మ‌హ‌నీయుల‌ను పూజించే మ‌హోన్న‌త సంస్కృతి మాకుంద‌ని చాటేందుకు వాటిని అక్క‌డే ఉంచుతారేమో...!!
---------------
నోట్‌:  వ‌చ్చే నాలుగేళ్ల‌లో అభివృద్ధి అంశంపై ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశాలు లేక‌పోతే మాత్రం మ‌ళ్లా ఆంధ్రా విగ్ర‌హాలు, ఆంధ్రా పార్టీలు బాగో అంటారేమో..!!

No comments:

Post a Comment