1

1

Wednesday 11 February 2015

ఢిల్లీకి కేంద్రం నిధులివ్వ‌కుంటే కేజ్రీవాల్ ఏం చేస్తాడో తెలుసా..?

ప్ర‌ధాని ఇంటి ముందు ముఖ్య‌మంత్రి ధ‌ర్నా?
ఇది రేప‌టి రోజుల్లో ఢిల్లీ పేప‌ర్ల‌లో ప‌తాక శీర్షిక వార్త కావొచ్చేమో..!!
---------------------
కేంద్ర ప్ర‌భుత్వం ఢిల్లీలో త‌మ ప్ర‌త్య‌ర్థి అయిన ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింద‌ని ఒక‌వేళ క‌క్ష సాధింపుగా నిధులు ఇవ్వ‌కుండా వివ‌క్ష చూపినా, స‌హ‌కారం అందించ‌క‌పోతే ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ఎలా ఎదుర్కొంటాడు..?  తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రావాల్సిన నిధులు రాక‌పోతే ఇక్క‌డి సీఎంలు వెళ్లి కాళ్లా వేళ్లా ప‌డి వేడుకుంటున్నారు.. నిధులివ్వండి, జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితి, ప్రాజెక్టులు పూర్తి చేయ‌లేమ‌ని మొర పెట్టుకుంటున్నారు.. మ‌రి కేజ్రీవాల్ ఏం చేస్తాడు?   అని అంద‌రూ ఆలోచిస్తున్నారు..
-----------------------------
కేంద్రంతో అన‌వ‌స‌రంగా జ‌గ‌డాలు పెట్టుకోబోమ‌ని మొన్న ఓ ఇంట‌ర్వ్యులో కేజ్రీవాల్‌ తేల్చిచెప్పాడు.. ఆరోగ్య‌వంత‌మైన ప్ర‌జాస్వామ్యంలో నాలుగు డీ ల‌కు ప్రాధాన్యం ఉంద‌ని.. అవే త‌న విధానం అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.. డిబేట్, డిస్క‌ష‌న్, డిసెంట్, ధ‌ర్నా.. మొద‌టి మూడింటితో ప‌నికాక‌పోతే  చివ‌ర‌గా ధ‌ర్నా అస్త్రాన్ని ప్ర‌యోగిస్తాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.. ఈ లెక్క‌న కేంద్రం వివ‌క్ష చూపితే ప్ర‌ధాన మంత్రి ఇళ్లు, కార్యాల‌యం, పార్ల‌మెంట్ ముందు ముఖ్య‌మంత్రి ధ‌ర్నాల‌ను మ‌నం త్వ‌ర‌లో చూడొచ్చ‌న్న మాట‌... తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి జ‌నాన్ని పోగేసుకెళ్లి ధ‌ర్నా చేయ‌డం క‌ష్టం కానీ ఢిల్లీ ముఖ్య‌మంత్రి.. ఢిల్లీలోని ప్ర‌ధాని ఇంటి ముందు ధ‌ర్నా చేయ‌డం పెద్ద క‌ష్ట‌మైన ప‌నేం కాదు..
నోట్‌: అయితే కేంద్రం త‌ర‌ఫున ఢిల్లీకి స‌హాయ‌క స‌హాకారాలు అందిస్తామ‌న్న మోడీ గారు మాట మీద నిల‌బ‌డితే ఈ ధ‌ర్నాలు చూసే అవ‌కాశం మ‌న‌కు రాదు.. కేంద్రం అన్ని రాష్ట్రాల‌ను స‌మానంగా చూడాల‌ని ఆకాంక్షిస్తున్నా !!


No comments:

Post a Comment