1

1

Wednesday, 11 February 2015

ఆప్‌, కాంగ్రెస్‌కు ఐటీ నోటీసులు..


ఎన్నిక‌ల్లో వివిధ కంపెనీల నుంచి వ‌చ్చిన విరాళాల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ల‌కు ఆదాయ‌పు ప‌న్ను శాఖ నోటీసులు జారీ చేసింది.. ఎప్పుడైనా స‌రే అధికార పార్టీ విరాళాల‌పై ఐటీ శాఖ‌లు నోటీసులు జారీ చేయ‌వు క‌దా.. గ‌తంలో యూపీఏ హ‌యాంలో గ‌డ్క‌రీ సంస్థ‌ల్లో పెట్టుబ‌డుల‌పై ఐటీ విచార‌ణ జ‌రిగింది... ఐటీ, సీబీఐలు ఎప్పుడు కూడా అధికార ప‌క్ష‌మే... మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీకి కేంద్రానికి మ‌ధ్య మ‌రో దీర్ఘ కాలిక యుద్ధం జ‌ర‌గ‌డం త‌థ్యంగానే క‌నిపిస్తోంది..
ఇప్ప‌టికే శార‌ద‌ స్కాం పేరు, బుర్ద్వాన్ పేలుళ్ల పేరుతో మ‌మ‌తా స‌ర్కారుతో కేంద్రానికి పెద్ద పంచాయితీ జ‌రుగుతోంది.. ఇక బీహార్‌లో రాజ‌కీయ సంక్షోభం క‌ళ్ల ముందు క‌నిపిస్తోంది.. ఇవ‌న్నీ స‌మాఖ్య స్ఫూర్తికి విఘాతం క‌లిగించే ప‌రిణామాలే అవుతాయి..
మొన్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీకి విరాళం ఇచ్చిన కంపెనీల పేర్లు న‌ల్ల‌ధ‌నం జాబితాలో ఉన్నాయి.. మ‌రి దీనిపైనా విచార‌ణ జ‌రగాలి క‌దా.. న‌ల్ల‌ధ‌నం కంపెనీల‌కు బీజేపీతో సంబంధం ఏంట‌న్న విచార‌ణ చేసే ధైర్యం విచార‌ణ సంస్థ‌ల‌కు ఉందా?

No comments:

Post a Comment