అప్పట్లో వైఎస్, యడ్యూరప్పలు తమకు పూర్తి సంఖ్యా బలం ఉన్నా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కున్నారు.. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ కేసీఆర్, చంద్రబాబులు ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు... ఒక రకంగా రాజ్యాంగం అపహాస్యం పాలవుతోంది.. ఇక నిన్న జార్ఖండ్‌లో జార్ఖండ్ వికాస్ మోర్చాకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.. వీరిలో ఒకరిద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని యోచిస్తున్నారట... మరి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇదే పంథాను కొనసాగిస్తుందా? సంప్రదాయ రాజకీయ పక్షాల మాదిరిగా ఫక్తు రాజకీయ పార్టీగా మారుతుందా? ఢిల్లీలో గెలిచిన ముగ్గురు బీజేపీ వాళ్లను లాక్కుంటుందా? వేచిచూడాలి.. ఏది ఏమైనా ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత ఇలా పక్క చూపులు చూడటం మంచి పరిణామం కాదు..
No comments:
Post a Comment