మరో సినీ తారను ముందే చంపేసిన మీడియా..!!
రేపో మాపో ఆమె నిజంగానే చనిపోతే.. ముందే చెప్పిన ఫలానా డాష్ ఛానెల్ అని కూడా అంటారేమో అన్న భయం వేస్తోంది..
-------------
టీవీ ఛానెళ్లు రేటింగ్‌ల వేటలో విశ్వసనీయతను కోల్పోతున్నాయి.. సమాచారాన్ని ముందే ఇచ్చామన్న క్రెడిట్‌ను సాధించాలనే తొందరలో వార్తలోని నిజానిజాలను పట్టించుకోవడం మానేశాయి.. ఇటీవల కాలంలో ఎమ్మెస్ నారాయణ చనిపోక ముందే చనిపోయినట్లు బ్రేకింగ్ న్యూస్ వేసి ఆ తర్వాత నాలుక కరుచుకున్నాయి.. కనీసం క్షమాపణ కూడా కోరలేదు.. ఇక ఈ రోజు తమిళ నటి మనోరమ చనిపోయినట్లుగా ప్రచారం చేశాయి.. ఆమె ఆ వార్తలను ఖండించారు. బ్రేకింగ్‌లు, రేటింగ్‌లు పక్కన పెట్టి విశ్వసనీయతను పెంచుకోవడానికి కృషి చేయాలని విజ్ఞప్తి...
---------------------
ఇక పత్రికలు కూడా కొన్ని కల్పిత కథనాలు రాస్తూ విశ్వసనీయ వర్గాల భోగట్టా అనడం పరిపాటిగా మారింది.. ఒకవేళ ఆ పత్రిక ఇచ్చిన సమాచారం తప్పయితే కనీసం తప్పు రాశామని చెప్పుకోవడం లేదు.. ఇది జర్నలిజానికి తీరని నష్టాన్ని తెచ్చిపెడుతుంది.. జర్నలిస్టుల విలువను తగ్గిస్తుంది.. నిజాయతీతో కూడిన నిజాలను రాయాలని విజ్ఞప్తి..!!

No comments:
Post a Comment