తెలంగాణలో ప్రభుత్వ నోటిఫికేషన్లు రాక ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని ఈ రోజు ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో వార్త వేశారు.. అసలు విచిత్రం ఏంటంటే ఆయన చనిపోయింది గత నెల 29వ తేదీన.. ఆయన వివరాలు పూర్తిగా ఇవ్వకుండా కేవలం నోటిఫికేషన్లు లేక చనిపోయారని రాసింది.. ఆయన ఏం చదివాడు? ఎక్కడ చదివాడు? వయసు ఎంత? ఈ వివరాలు ఏమీ లేవు...
-----------
ఆ వార్త కిందనే సెంట్రల్ పోలీసు ఫోర్సు కోసం 62 వేల పోస్టుల భర్తీ జరగనుందని వార్త ఉంది.. దాని కిందనే తెలంగాణ సింగరేణిలో 5500 ఉద్యోగాల భర్తీని జూన్ లోగా చేపట్టనున్నట్లు వార్త ఉంది...
నిరుద్యోగులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలి.. సింగరేణితో మొదలవుతున్న సర్కారీ కొలువుల నోటిఫికేషన్లు ఇంకా పెరుగుతాయి.. అలాగే కేంద్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంక్ కొలువులు వేలల్లో ఉంటున్నాయి.. వీటికి కూడా సర్వసన్నద్ధం కావాలి.. నిరుద్యోగుల ఆశలు ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.!!
No comments:
Post a Comment