1

1

Tuesday 24 February 2015

తెలంగాణ ఉద్య‌మంలో డెస్కు జ‌ర్న‌లిస్టుల పాత్ర కూడా అద్వితీయం...!

తెలంగాణ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి..
*****
తెలంగాణ ఉద్య‌మంలో డెస్కు జ‌ర్న‌లిస్టుల పాత్ర  కూడా అద్వితీయం...!
సోష‌ల్ మీడియా అక్ష‌ర సైనికుల పాత్ర అనిర్వ‌చ‌నీయం..!!!
-----------------------
తెలంగాణ ఉద్య‌మంలో తెలంగాణ జ‌ర్న‌లిస్టులు అద్భుతంగా ప‌నిచేశారు. యాజ‌మాన్యాల ఒత్తిళ్లు ఉన్నా స‌రే త‌మ‌కు చేత‌నైనంత‌గా ఉద్య‌మంలో తోడ్పాటునందించారు. కొంద‌రు ఉద్య‌మ‌కారుల‌కు సూచ‌న‌లు, స‌ల‌హాలు అందించ‌గా మ‌రికొంద‌రు త‌మ రాత‌ల ద్వారా ఉద్య‌మానికి ఉత‌మిచ్చారు. అయితే జ‌ర్న‌లిస్టు అంటే కేవ‌లం క్షేత్ర స్థాయిలో ఉండే వారే అన్న భావ‌న తొల‌గిపోవాలి. ఎందుకంటే క్షేత్ర స్థాయిలో అర‌కొర స‌మాచారంలో, ఆద‌రాబాద‌ర‌గా ఇచ్చే వార్త‌ల‌ను డెస్కులో ప‌నిచేసే ఉప సంపాద‌కులు ఓ అంద‌మైన వార్త‌గా తీర్చిదిద్దుతారు. సామాన్య పాఠ‌కుల‌కు అర్థ‌మ‌య్యే రీతిలో దాన్ని మార్చుతారు.. అలాంటి ఉప సంపాద‌కులు లేకుండా విలేక‌రి పంపిన వార్త‌లు య‌థాత‌థంగా ముద్రిస్తే  పాఠ‌కులు ఆ వార్త‌ప‌త్రికపై దండ‌యాత్ర చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌ర‌సం లేదు.. ఇంకా చెప్పాలంటే విలేక‌రి కొన్ని సంద‌ర్భాల్లో అవినీతికి గురికావొచ్చు కానీ ఉప సంపాద‌కుడు జీతాన్ని న‌మ్ముకుని జీవితాన్ని మొత్తం వృత్తికే అంకితం చేస్తాడు..విలేక‌రి ఉషోద‌యాన్ని, సూర్యాస్త‌మ‌యాన్ని చూస్తాడేమో కానీ.. ఉప సంపాద‌కుడి జీవితంలో ఆ రెండు ఉండ‌వు.. సాయంత్రం ఆఫీసుకెళ్తే నిషాచ‌రిలా ప‌నిచేసి అర్ధ‌రాత్రో అప‌రాత్రో ఇంటికి చేరుతాడు.. అనారోగ్యం వెంటాడుతున్నా వృత్తికి అంకిత‌మై జీవితాన్ని త్యాగం చేస్తాడు.. అలాంటి డెస్కు మిత్రుల‌ను జ‌ర్న‌లిస్టులే కాద‌నే వాడు మ‌నిషే కాదు. అస‌లు వాడు జ‌ర్న‌లిస్టే కాదు, వాడికి జ‌ర్న‌లిజం ఓన‌మాలే తెలియ‌వు అన్న‌ది నా నిశ్చితాభిప్రాయం.
----------------------
తెలంగాణ ఉద్య‌మంలో కొంద‌రు విలేక‌రులు ఆంధ్రా యాజ‌మాన్యాలు చెప్పిన‌ట్లు ఉద్య‌మాన్ని దెబ్బ‌తీసే రాత‌లు రాసినా.. డెస్కులో ఉన్న తెలంగాణ ప్రాంత ఉప సంపాద‌కులు వాటి తీవ్ర‌త‌ను త‌గ్గించే హెడ్డింగ్‌లు పెట్ట‌డం, ముఖ్యంగా యువ‌త ఎలాంటి ఆత్మాహుతి చేసుకోకుండా చూసేలా వార్తా శైలిని మార్చిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.. యాజ‌మాన్యం ఎలాంటి కుట్ర‌లు చేస్తోంది టీఆర్ఎస్ అధినాయ‌క‌త్వానికి వేగుల్లా చేర‌వేసిన ఉప సంపాద‌కులు కోకొల్ల‌లు. అలాంటి వారిని జ‌ర్న‌లిస్టులుగా చూడ‌లేని వారిని ఏమ‌నాలో మాట‌లు రావ‌డం లేదు. తెలంగాణ ఉద్య‌మంలో విలేక‌రులు, ఉప సంపాద‌కుల భాగ‌స్వామ్యం స‌రిస‌మానం.. !
---------------
ఇంకా చెప్పాలంటే సోష‌ల్ మీడియాలో న‌యా పైసా ఆశించ‌కుండా రాత్ర‌న‌కా ప‌గ‌ల‌న‌కా రాత‌లు రాసిన నెటిజ‌న్లు కూడా అక్రిడియేష‌న్ లేని జ‌ర్న‌లిస్టులే.. నాకు తెలిసి విలేక‌రుల‌కు, ఉప సంపాద‌కులకు, సోష‌ల్ మీడియాలో విస్తృతంగా రాస్తున్న మిత్రుల‌ను కూడా జ‌ర్న‌లిస్టులుగా గుర్తించి వారికి అక్రిడియేష‌న్ ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి.. !!
----------------
నోట్‌:  అక్రిడియేష‌న్లు  ఇవ్వ‌డం వ‌ల్ల పెద్ద న‌ష్టం ఉండ‌దు.. వీలైతే విలేక‌రులు బ‌స్సుల్లో ఎన్నిసార్లైయినా ప్ర‌యాణించ‌డానికి అవ‌కాశం ఇవ్వ‌డం, అలాగే డెస్కు జ‌ర్న‌లిస్టులు  నెల‌లో రెండుసార్లు అక్రిడియేష‌న్ కార్డును ఉప‌యోగించుకొనే నిబంధ‌న పెట్టాలి. సోష‌ల్ మీడియాలో ఎలాంటి పైసా
ఆశించ‌ని వారి సేవ‌ల‌ను గుర్తిస్తే స‌రిపోతుంది.. వారికి అక్రిడియేష‌న్ ఇచ్చి ప్ర‌భుత్వ ప్ర‌యోజ‌నాలు అందించ‌కున్నా వాళ్లు ఎంతో సంతోషిస్తార‌ని నా నా న‌మ్మ‌కం...

No comments:

Post a Comment