మొన్న కేరళలో జరిగిన జాతీయ క్రీడల్లో తెలంగాణ అత్యద్భుతంగా ప్రతిభ కనబరిచింది. మొత్తం 33 పతకాలు సాధించింది. అందులో ఎనిమిది స్వర్ణ పతకాలు ఉన్నాయి.. పతకాల పట్టికలో 12వ స్థానంలో నిలిచింది.. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవం 16 పతకాలు సాధించి 18వ స్థానంలో ఉంది.. క్రీడలకు మరింతగా ప్రోత్సాహకాలు ఉంటే తెలంగాణే మొదటి స్థానంలో నిలిచినా ఆశ్చర్య పోనవసరం లేదు. తెలంగాణ విడిపోతే ఏ రంగంలోనైనా వెనకబడుతుందని పనిగట్టుకు ప్రచారం చేసిన వారందరికీ ఇది ఓ చెంపపెట్టులాంటిదే..
ఇక చదువుల్లోనూ తెలంగాణ విద్యార్థులు రాణిస్తున్నారు.. మొన్నామధ్య అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థల్లో లక్షల వేతనంతో కూడిన కొలువులు పొందారు తెలంగాణ యువ మేధావులు.. ఇక నిన్నటికి నిన్న అజిం ప్రేమ్‌జీ యూనివర్సిటీలో 30 ఫ్రీ సీట్లలో 22 ఫ్రీ సీట్లను తెలంగాణ విద్యార్థులే కైవసం చేసుకోవడం విద్యారంగంలోనూ మనవారు ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది...
-----------
క్రీడలు, సంస్కృతికం, విద్యా, ఆరోగ్యం, పర్యాటకం ఇలా అన్ని రంగాల్లోనూ ముందుండాలి.. తెలంగాణ ఏర్పడిన ఏడాదిలోపే ఇలాంటి విజయాలు నమోదు కావడం నిజంగా గొప్ప విషయమే..
No comments:
Post a Comment