1

1

Tuesday, 10 February 2015

కేజ్రీ ముందు పెద్ద స‌వాల్‌.. పార్టీ విస్త‌ర‌ణే...!

చెట్టు పేరు చెప్పుకొని కాయ‌లు అమ్ముకోవ‌ద్దు...
-------------
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ విజ‌యంతో ఇక స్థానికంగా ఆప్ నేత‌లు పుట్టుకు రావ‌డం.. వారు కేజ్రీవాల్ ఇమేజ్‌తో ఎదిగే ప్ర‌య‌త్నం చేయ‌డం జ‌రుగుతుంది.. ఈ ప్ర‌య‌త్నంలో ఆ నాయ‌కుల అవ‌ల‌క్ష‌ణాలు పార్టీకి చెడ్డ‌పేరు తేవ‌డ‌మే కాకుండా భ్ర‌ష్టుప‌ట్టి పోవ‌డానికి కార‌ణం అవుతాయి.. ఈ విష‌యంలో కేజ్రీవాల్ జాగ్ర‌త్త‌గా అడుగులు వేయాలి... ఎవ‌రిని ప‌డితే వారిని పార్టీలో చేర్చుకోవ‌ద్దు.. చేరిన నేత‌లు కేవ‌లం టీవీ చ‌ర్చ‌ల్లో ముందు ఉండ‌టం క‌న్నా జ‌నంలో ముందు ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాలి.. ఢిల్లీ విజయం రాత్రికి రాత్రి వ‌చ్చిన‌ది కాద‌న్న స‌త్యం కొత్త‌గా చేరే వారికి అర్థం అయ్యేలా చేయాలి.. జ‌నంలో ఉంటూ జ‌నం అభిమానాన్ని పొందిన‌ప్పుడే పార్టీకి ఆద‌రాభిమానాలు ఉంటాయ‌న్న నిష్టూర స‌త్యం తెలియ‌నంత వ‌ర‌కూ ఇత‌ర రాష్ట్రాల్లోని ఆప్ నేత‌లు ఊహ‌ల స్వ‌ర్ణంలో విహ‌రించ‌డం ఖాయం... మ‌రి కేజ్రీవాల్ ఢిల్లీలో ప్ర‌భుత్వాన్ని న‌డుపుతూ ఇత‌ర రాష్ట్రాల్లోకి పార్టీని ఎలా విస్త‌రిస్తార‌నేది ఇప్పుడు అస‌లు స‌వాల్‌..  సంప్ర‌దాయ పార్టీ మాదిరిగా ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారిని గంప‌గుత్త‌గా చేర్చుకుంటే మొద‌టికే మోసం వ‌స్తుంది.. అందుకే మేధావులు, యువ‌త‌కు పెద్ద పీట వేయ‌డంలాంటివి చేయాలి.. స్థానిక ప‌రిస్థితుల‌ను అవ‌గ‌తం చేసుకొని అందుకు అనుగుణంగా విధానాల రూప‌క‌ల్ప‌న చేయాలి.. గెలుపు ఊపుతో త‌ప్ప‌ట‌డుగులు వేయొద్దు.. ఇత‌ర రాష్ట్రాల్లో వాస్త‌వ బ‌లాన్ని తెలుసుకోవాలి.. ప్ర‌తీ రాష్ట్రంలోనూ ఎంపిక చేసిన నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసి మెరుగైన ఫ‌లితాలు తెచ్చుకోవాలి.. అంతేకానీ గ‌రిష్ఠ స్థానాల్లో పోటీ చేసి క‌నిష్ట ఫ‌లితాలు సాధించ‌డం వృథాప్ర‌యాసే అవుతుంది.. విశ్వ‌సనీయ‌త‌ను ఇది దెబ్బ‌తీస్తుంది..!!

No comments:

Post a Comment