అయితే గత ఏడాది జరిగిన సమగ్ర సర్వే, పింఛన్ల విషయంలో ఉద్యోగులు చాలా కష్టపడ్డారు.. అది అంగీకరించాల్సిన విషయమే.. అయితే అవినీతి తగ్గాలి.. ప్రభుత్వం ఏ విధంగా అయితే ఉద్యోగుల ఫ్రెండ్లీగా ఉంటోందో.. అదే విధంగా ఉద్యోగులు కూడా ప్రజల ఫ్రెండ్లీగా ఉండాలి... ఎందుకంటే జీతాలు పెంచుతున్నది ప్రభుత్వమే అయినప్పటికీ పన్నుల రూపంలో జీతాలకు సొమ్ములు ఇస్తున్నది ప్రజలే అన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని మనవి... తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగులు పాత్ర ఎంతో ఉంటుంది.. దయచేసి ఉద్యమ సమయంలో చూపిన స్ఫూర్తిని కొనసాగించాలని విజ్ఞప్తి.. ప్రజలకు సేవలు అందించడమే మన బాధ్యత అని అనుకొని విధులు నిర్వర్తించాలి..
No comments:
Post a Comment