రాజకీయాల్లో వాళ్లు ప్రత్యర్థులు.. ఒకరి రాజకీయ భవిష్యత్ ను మరొకరు దెబ్బ తీశారు.. అయినా సరే రాజకీయాలు రాజకీయాలే.. స్వరాష్ట్ర ప్రయోజనాల విషయంలో మేమంతా ఒకటే.. మన తెలంగాణ సస్యశ్యామలం కావాల్సిందే అన్నదే వారి ఆకాంక్ష. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రయోజనమే పరమావధిగా ముందడుగు వేశారు. మహారాష్ట్రను ఒప్పించి జల వివాదాలను పరిష్కరించుకుంటూ చరిత్రాత్మక ముందడుగు వేశారు. ఈ విషయంలో కేసీఆర్ ఎంత చొరవ తీసుకున్నారో.. అదే స్థాయిలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు గారు చొరవ తీసుకున్నారు. ఇద్దరు కలిసి తెలంగాణకు మేలు చేకూర్చారు. వారిద్దరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
వీళ్లిద్దరే కాకుండా హరీశ్ రావు, ఢిల్లీలో ఉన్న తెలంగాణ బిడ్డ శ్రీరాం వెదిరె, మన జల వనరుల నిపుణులు విద్యాసాగర్ రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పేరును మరచిపోతే ఈ పోస్టుకు అర్థం ఉండదు. ఈ ఒప్పందానికి సుముఖత తెలియజేసిన ఆయనకు తెలంగాణ ప్రజానీకం తరఫున కృతజ్ఞతలు..
****
మనం ఏ పార్టీలో ఉన్నా సరే మన తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఏకం కావాల్సిందే. ఈ స్ఫూర్తి నిరంతరం కొనసాగాలి. మిగిలిన పార్టీల నేతలు కూడా సందర్భం వచ్చినప్పుడు సంఘటితంగా ముందుకు సాగాలి. మన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చాలి. జై తెలంగాణ.. జై జై తెలంగాణ..!!
*****
నోట్ : మహారాష్ట్రలో కాంగ్రెస్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి చరిత్రాత్మక ఒప్పందాలు జరగలేదు.. కారణం ఒక్కటే.. తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న చిత్తశుద్ధి అప్పటి పాలకులకు లోపించడమే.. పాలించిన వాడు మనోడు అయితే మన గురించి ఆలోచిస్తాడు.. కాకపోవడం వల్లే దాదాపు 60 ఏళ్లు తండ్లాట పడ్డాం. అప్పటికీ ఇప్పటికీ పాలనలో తేడా సుస్పష్టంగా కనిపిస్తుంది.
No comments:
Post a Comment