1

1

Friday 5 February 2016

వికీలీక్స్‌ జూలియ‌న్ అసాంజేకి స్వేచ్ఛ‌

వికీలీక్స్‌ జూలియ‌న్ అసాంజేకి స్వేచ్ఛ‌
*************
వికీలీక్స్ వ్య‌వ‌స్థాప‌కుడు, నిర్భ‌య, ప‌క్ష‌పాత ర‌హిత‌ పాత్రికేయానికి నిలువుట‌ద్దంగా నిలిచి అగ్ర‌దేశాల ద్వంద్వ నీతిని ఎండ‌గ‌ట్టిన పోరాట యోధుడు జూలియ‌న్ అసాంజే కి స్వేచ్ఛ ల‌భించింది. ఐక్య రాజ్య స‌మితి ప్యానెల్‌ అసాంజేకు అనుకూలంగా తీర్పును వెలువ‌రించింది.. ఆయ‌న స్వేచ్ఛ ను దూరం చేసిన నేరానికి ప‌రిహారం కూడా చెల్లించాల‌ని స్ప‌ష్టం చేసింది.. ఈ రోజు చ‌రిత్రాత్మ‌క రోజు.. నిర్బంధ‌పు సంకెళ్లు తెగిన రోజు.. దాదాపు మూడేన్న‌రేళ్లుగా బ్రిట‌న్ లోని ఈక్వెడార్ రాయ‌బార కార్యాల‌యంలో ఆశ్ర‌యం పొందుతున్న అసాంజే సాగించిన పోరాటం
ఎట్ట‌కేల‌కు విజ‌య‌తీరాల‌కు చేరింది.. దీన్ని నెటిజ‌న్లంద‌రూ విజ‌య దినంగానే ప‌రిగ‌ణించాలి. నీతి, నిజాయ‌తీతో పాత్రికేయ వృత్తిలో కొన‌సాగుతున్న జ‌ర్న‌లిస్టులంద‌రికీ ఇది ప‌ర్వ‌దిన‌మే.. అసాంజే స్వేచ్ఛ‌గా మ‌రిన్ని దేశాల అరాచ‌క‌త్వాన్ని, కుటిల దౌత్య విధానాల‌ను వికీలీక్స్ కేబుల్స్ ద్వారా ఎండ‌గ‌ట్టాల‌ని ఆకాంక్షిస్తున్నా.. గ‌తంలో మాదిరిగానే తెలంగాణ‌కు సంబంధించిన ప‌లు కేబుల్స్ ను అసాంజే వెలుగులోకి తేవాల‌ని కోరుకుంటున్నా.. ఆల్ ద బెస్టు జూలియ‌న్‌ అసాంజే.. !!
***************
నోట్ : తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో నా సొంత పేరుతో పోస్టులు రాయ‌డం వ‌ల్ల వ్య‌క్తిగ‌తంగా త‌లెత్తిన ఇబ్బందుల మూలంగా అనివార్యంగా పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి త‌లెత్తింది. ఆ స‌మ‌యంలోనే(2012 మే నెల‌లో) నేను అత్యంత అభిమానించే అసాంజే ను అరెస్టు చేయ‌డానికి బ్రిట‌న్ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించింది. అప్పుడే ఈక్వెడార్ రాయ‌బార కార్యాల‌యంలో ఆయ‌న‌కు ఆశ్ర‌యం దొరికింది. దీంతో ఫేసుబుక్ లో రాయ‌డానికి వీలుగా తెలంగాణ అసాంజేగా పేరును మార్చుకున్నా.. ఆయ‌న బొమ్మ‌ను వాడుకున్నా.. ఈ విష‌యంలో జూలియ‌న్ అసాంజేకి స‌దా రుణ‌ప‌డి ఉంటా.. ఎందుకంటే ఆయ‌న పేరుతో నిర్భ‌యంగా తెలంగాణ ఉద్య‌మం కోసం నా వంతుగా భావ‌జాల వ్యాప్తికి, ఆంధ్రా మీడియా అరాచ‌కాల‌ను ఎండ‌గ‌ట్టే భాగ్యం ల‌భించింది. ఎంద‌రో ముఖ‌ప‌రిచయం లేని ముఖ పుస్త‌కం(ఫేసుబుక్‌) మిత్రులు దొరికారు..!!
***********
ఒక్క జూలియ‌న్‌ అసాంజే ఎంద‌రో అసాంజేలను త‌యారు చేయ‌గ‌ల‌డని నిరూపిత‌మైంది.. ఈ రోజు తెలంగాణ అసాంజే, క‌ల్వ‌కుర్తి అసాంజే, వేముల‌వాడ అసాంజే అంటూ ప్ర‌తీ ఊరికి ఒక అసాంజే పుట్టుకొచ్చాడు. ఐ యామ్ వెరీ హ్యాపీ.. !!

No comments:

Post a Comment