1

1

Friday 5 February 2016

ఇదేం ఉన్మాదం..

* మా క‌డుపులు మాడ్చుకొని రైలు రోకోలు చేశాం.. కానీ రైళ్ల‌ లో ఉండే ప్ర‌యాణికులు అవ‌స్థ‌లు ప‌డ‌కుండా అన్న పానీయాలు అందించాం..
* లాఠీ దెబ్బ‌లు తింటూనే మిలియ‌న్ మార్చ్ లు చేశాం.. సాగ‌ర హారాల్లో పాల్గొన్నాం.. సాధార‌ణ ప్ర‌యాణికుడిని ఎప్పుడూ టార్గెట్‌గా చేసుకోలేదు..
* స‌క‌ల జ‌నుల స‌మ్మె అంటూ మాకు మేమే శిక్ష విధించుకుంటూ నిర‌శ‌న తెలిపాం.. ఉద్యోగుల‌కు జీతాలు రాకున్నా, పిల్ల‌లు చ‌దువుల‌కు దూరం అవుతున్నా జై తెలంగాణ అంటూ నిన‌దించాం.. 
* రోడ్డుపైనే వంటా వార్పు చేశాం.. కానీ ట్రాఫిక్ క‌ష్టాలు త‌లెత్త‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాం...
* చ‌లో అసెంబ్లీలు చేశాం.. బాష్ప‌వాయువు గోళాలు తిన్నాం.. కానీ ఏ ఒక్క పోలీసును గాయ‌ప‌ర‌చ‌లేదు.. ఏ ఒక్క పోలీసు స్టేష‌న్ ను త‌గ‌ల‌బెట్ట‌లేదు..
* చ‌ట్టాన్ని ప‌రిర‌క్షించే పోలీసన్న‌ల‌ను గౌర‌విస్తూనే నిర‌శ‌న‌లు కొన‌సాగించాం...
* మా నాయ‌కుల‌ను నిర్బంధించి, మా పోరాటంపై ఉక్కు పాదం మోపాల‌ని చూపిన‌ప్పుడు ట్యాంకుబండ్‌పై ధ‌ర్మాగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించాం..
* హింసాత్మ‌క ఆందోళ‌న‌కు పిలుపునిచ్చే స‌త్తా కేసీఆర్ కు లేకా కాదు.. అలాంటి ఆందోళ‌న‌లు చేసే ధైర్యం తెలంగాణ జ‌నానికి లేకా కాదు..
* 2009లో తెలంగాణ ఏర్పాటుకు పార్ల‌మెంట్ లో హామీ ఇచ్చి అమ‌లు చేయ‌క‌పోయినా ఓపిక‌గా నాలుగేళ్లు స‌హించాం.. పోరాటాన్ని కొన‌సాగించాం...
****
నోట్ : మ‌రి 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ కాపు రిజ‌ర్వేష‌న్ల‌కు హామీ ఇచ్చింద‌ని.. వెంట‌నే అమ‌లు చేయాల‌ని ఇంత విధ్వంసం కొన‌సాగించ‌డం స‌బ‌బు కాదు.. ఓపిక‌గా హ‌క్కుల సాధ‌న‌కు ఉద్య‌మించాలి.. వీలైతే తెలంగాణ ఉద్య‌మాన్ని స్ఫూర్తిగా తీసుకోండి.. హామీల అమ‌లుకు ప్ర‌శాంతంగా పోరాటం సాగించండి..

No comments:

Post a Comment