జెండా ఊంఛా రహే హమారా..!!
********
ఈ దేశంలో జాతి జెండా కున్న ప్రాధాన్యం తెలియని వాళ్లు ఎందరో ఉన్నారు.. ఇందులో విద్యార్థులనే కాదు చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ కోవ లోకే ఈ దేశ ప్రధాన మంత్రి సైతం వస్తారు.. పాపం ఆయన విదేశీ పర్యటన సందర్భంగా కొన్ని సార్లు జాతీయ జెండాకు తెలిసో తెలియకో అగౌరవం కలిగించారు. జెండా తల కిందులుగా ఎగురుతున్నా పట్టించుకోలేదు.
ఇక ఉప రాష్ట్రపతి గారు జెండాకు వందనం చేయలేదని కొందరు తెగ హడావుడి చేశారు. తీరా ప్రోటోకాల్ ప్రకారమే ఆయన ప్రవర్తించారని తెలిసి ముక్కున వేలేసుకున్నారు. ఇలాంటి నియమాలు తెలియని మూర్ఖులంతా తామే దేశ భక్తులం.. మిగిలిన వారంతా దేశ ద్రోహులనే దుస్థితి దాపురించింది.
************
ఈ దేశాన్ని పాలించే ప్రముఖులకే లేని సామాజిక స్పృహ సామాన్యులకు ఎలా ఉంటుంది. ఏదో పంద్రాగస్టు, జనవరి 26కు ముందు రెండు మూడు ప్రకటనలు ఇచ్చి జాతీయ జెండాను గౌరవించాలని అంటే సరిపోదు.
ఏది ఏమైతేనేం కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరవేయాలన్న నిర్ణయం చాలా మంచిది. ఎందుకంటే ఈ దేశానికి అత్యధికంగా రాజకీయ నేతలను పంపుతున్న సంస్థల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి. జేఎన్‌యూ నుంచి ఎందరో నేతలు పుట్టుకొచ్చారు. జాతీయ జెండాను ఎలా గౌరవించాలో, దానికి ఉన్న ప్రాధాన్యం ఏంటో భావి రాజకీయ నేతలకు తెలియజెప్పడం మంచి విషయమే. అయితే జాతీయ జెండాను ఎలా గౌరవించాలి. దానికున్న నియమ నిబంధనలు ఏమిటో కూడా స్పష్టంగా తెలియజేయాలి.
ఢిల్లీ లోని చరిత్రాత్మక కనాట్ ప్లేస్ లోని సెంట్రల్ పార్కులో ఎగురుతున్న రీతిలో ప్రతీ గ్రామంలో, మండలంలో, పట్టణంలో, నగరంలో చరిత్రాత్మక ప్రాంతంలో భారీ మువ్వన్నెల జెండా రెపరెపలాడాలి. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది.
*********
నోట్ : ప్రభుత్వాలు ఆదేశాలు ఇవ్వకముందే, జేఎన్‌యూ వివాదాలు మొదలు కాకముందే గత నాలుగేళ్లుగా నా ఫేసుబుక్ వాల్‌పై మువ్వన్నెల జెండా రెపరెప లాడుతూనే ఉంది... అయినా కూడా కొందరు భక్తులు నన్ను దేశ ద్రోహి అంటుంటే ఏమనాలో అర్థం కావడం లేదు. !!
No comments:
Post a Comment