1

1

Wednesday, 10 September 2014

అనైతిక జ‌ర్న‌లిజం విలువ‌లు పాటిస్తే ప‌త‌నం త‌ప్ప‌దు...!!!


మీడియా దిగ్గ‌జం రూప‌ర్ట్ మ‌ర్డోక్ ప‌త్రిక న్యూస్ ఆఫ్ ద వ‌ర‌ల్డ్ రెండేళ్ల క్రితం మూత‌ప‌డింది.. లేదు లేదు మూసేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది... జ‌ర్న‌లిజంలో సంచ‌ల‌నాల కోసం ఫోన్ హ్యాకింగ్ లాంటి దిగ‌జారుడు ప‌నుల‌కు పాల్ప‌డ‌టం వ‌ల్ల ఆ ప‌త్రిక‌ను బ్రిట‌న్ స‌హా ప్ర‌పంచంలోని అన్ని మీడియా సంస్థ‌లు, ప్ర‌జ‌లు దుమ్మెత్తిపోశారు.. జ‌ర్న‌లిజం విలువ‌ల‌ను దిగ‌జార్చింద‌ని మండిప‌డ్డాయి.. దాదాపు 170 ఏళ్ల చ‌రిత్ర ఉన్న‌, అత్య‌ధిక స‌ర్య్కులేష‌న్ ఉన్న ప‌త్రిక య‌జ‌మానిని బ్రిట‌న్ పార్ల‌మెంట్‌లో విచారించారు... పోలీసుల ద‌ర్యాప్తూ జ‌రిగింది... చివ‌ర‌కు ప‌త్రిక‌ను మూసేస్తున్న‌ట్లు రూప‌ర్ట్ మ‌ర్డోక్ ప్ర‌క‌టించాడు... 200 మంది ఉద్యోగులు నిరుద్యోగుల‌య్యారు...

జ‌ర్న‌లిజంలో విలువలు పాటించ‌కుండా అనైతిక పాత్రికేయానికి పాల్ప‌డిన మీడియా సంస్థ‌ల‌కు ఎంత‌టి ఘ‌న‌మైన చ‌రిత్ర ఉన్నా కూడా జ‌నం ఛీకొడ‌తారు... చివ‌ర‌కు వాటిని మూసుకోవాల్సిన ప‌రిస్థితి త‌ప్ప‌దు... !!!

No comments:

Post a Comment