ట్యాంక్ బండ్పై పనికి రాని విగ్రహాలను తొలగిస్తామని కేసీఆర్ ప్రకటిస్తే గానీ.. ఆంధ్రాలో తెలంగాణ మహనీయుల విగ్రహాలు పెడతామన్న మాట రాలేదంటే వీళ్లను ఏమనాలి.. ఒకవేళ ట్యాంక్ బండ్ విగ్రహాల గురించి కేసీఆర్ మాట్లాడకుండా ఉంటే ఆంధ్రాలో తెలంగాణ మహనీయుల విగ్రహాలు పెడతామనే ప్రతిపాదన వచ్చేదా?
వీళ్ల వంచన మాటలను మనం నమ్మొచ్చా? మళ్లీ వంచనకు గురైతే తప్పు మనదే కాదా?
పనికిమాలిన విగ్రహాలట! పెద్దల నా విధంగానేనా దూషిచటం? భగవంతుడు కాలస్వరూపుడు. ఈ అవినయానికి ఫలితం తప్పక ప్రసాదిస్తాడు సుమా!
ReplyDeleteపనికిమాలినవారు పనిబడి యన్న
పనికిమాలినమాట పనిగొని తలచు
పనికిమాలినవారి పాడుబుధ్ధులకు
పనికిమాలినవారి వలె దోచి నంత
పనికిమాలినవారె బయటి వారనెడు
పనికిమాలిన బుధ్ధిభ్రష్టత్వరోగ
మునజేసి యౌచిత్యమును తెగగోసి
స్వర్గస్థులైయున్న సత్పూరుషులను
దోషమెంచక మీరు దూషించినంత
వారి ఘనతల కేల వాటిల్లు దొసగు
వారి నామము లేల వాయును కీర్తి
వారి చెయ్వుల కేల వచ్చును మచ్చ
వారి మాటల మంచి వసివాడి పోదు
వారి మాటలు దబ్బరలు గాబోవు
వారి దార్శనికత వట్టిది కాదు
వారి దారులు మూతబడి చెడిపోవు
వారిని కాదని వాగినంతటనె
వారిస్ఫూర్తికి లోటు వచ్చుట కల్ల
వారిని పడతిట్టి పండ్లికిలించ
వారికి వచ్చెడు బాధయు లేదు
వారి విగ్రహములు పగుల నేయగనె
వారి జ్ఞాపకములు వాడిపోబోవు
వారిని కాదను పామరులైన
వారిని కాలమే పట్టి గ్రసించు
అన్నోదకంబుల కట్టివారల
కన్నివిధంబుల నగచాట్లు గలగు
దుమ్మైన పిదప నా తుళువల గూర్చి
యిమ్మహి దలచబో రెవ్వరు గాని
తథాస్తు.
కె.సి.ఆర్. నంది అంటే చంద్రబాబు పంది అనడానికి సిద్ధపడినట్టే ఉంది.
ReplyDeleteసార్.. వాటిని పనికి మాలిన విగ్రహాలు అని అనడం లేదు... తెలంగాణకు అక్కరకు లేని విగ్రహాలని మాత్రమే అన్నారు... మనకు అక్కరకు రాని విగ్రహాలు చాలా ఉన్నాయి.. వాటి స్థానంలో తెలంగాణ మహనీయుల విగ్రహాలను పెడతామని మాత్రమే కేసీఆర్ అన్నారు..
ReplyDelete