1

1

Wednesday 1 October 2014

మ‌నం సిగ్గుప‌డాల్సిన వార్తే ఇది...

జూలో మృగాల‌కు ఎక్లోజ‌ర్లు ఉంటాయి..
ఇప్పుడు మ‌న‌కూ ఆర్టీసీ బ‌స్సుల్లో ఎక్లోజ‌ర్ల త‌ర‌హాలో కంచెలు రాబోతున్నాయి..
జూ ఎక్లోజ‌ర్లు మృగాళ్ల నుంచి మ‌నుషుల‌ను ర‌క్షించ‌డానికి..
మ‌రి బ‌స్సుల్లో కంచెలు మృగాళ్ల నుంచి మ‌హిళ‌ల‌ను కాపాడేందుకు...
మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం పూనం మాల‌కొండ‌య్య నేతృత్వంలోని క‌మిటీ ఇచ్చిన సూచ‌న‌ల్లో బ‌స్సుల్లో మ‌హిళ‌ల వెన‌క సీట్ల‌లో ఇనుప కంచెల‌ను ఏర్పాటు చేసి అతివ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తార‌ట‌.. అస‌లు కొంద‌రు మృగాళ్ల చేష్ట‌ల వ‌ల్ల ఇలాంటి దుస్థితి దాపురించింది.. బ‌స్సుల్లో వెళుతుంటే అమ్మాయిల‌ను వేధించ‌డం, వారితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డం చేస్తుంటారు.. ఇది యువ‌కుల‌కే కాదు వ‌య‌సు మ‌ళ్లిన కొంద‌రు కూడా ఇలా చేస్తూ క‌నిపించారు. అమ్మాయిల‌ను కావాల‌ని తాక‌డాలు చేస్తుంటారు.. అస‌లు అదే బ‌స్సులో మ‌న అమ్మ‌, చెల్లి, అక్క ప్ర‌యాణిస్తే ఎవ‌రైనా అలా చేస్తే స‌హిస్తామా? క‌నీసం ఆ ఆలోచ‌న‌నే అంగీక‌రించం.. మ‌రి ఇత‌ర స్త్రీలు క‌నిపిస్తే ఎందుకీ పైత్యం...
ఇత‌రుల‌పై ప‌డి దాడి చేస్తాయేమో అని జూ పార్కులో క్రూర మృగాళ్ల‌ను ఎక్లోజ‌ర్ల‌లో ఉంచిన‌ట్లు ఇప్పుడు మ‌హిళ‌ల‌పై ప‌డి దాడి చేయ‌కుండా ఎక్లోజ‌ర్ల త‌ర‌హాలో కంచెలు బ‌స్సుల్లోనూ పెడుతార‌ట‌... ఆ ఎక్లోజ‌ర్ల‌ను చూసిన‌ప్పుడ‌ల్లా మ‌నం త‌ల‌దించుకోవాల్సిందే...
మ‌న ప్ర‌వ‌ర్త‌న మారితే ఇలా ఆడ‌వాళ్ల కోసం బ‌స్సుల్లో ఇనుప కంచెల ఆలోచ‌న చేసేవారేకాదు.. మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేక బ‌స్సులు వేయాల‌నుకునే వారుకాదు..

No comments:

Post a Comment