నా భావన... పాత అభిప్రాయమే...
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్త పరిచాను.. మరోమారు పునరుద్ఘాటిస్తున్నా...
ఏదేశమేగినా.. ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని... నిలపరా నీజాతి నిండుగౌరవాన్ని... అన్న గేయాన్ని ప్రస్తుతం కొంచెం మార్చుకోవాలన్నది నా భావన...
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఆ గడ్డనే నీ మాతృగడ్డగా భావించు.. అక్కడి మనుషులతో మమేకం కా... అంతేకానీ నీ తల్లి భూమి భారతిని పదేపదే అక్కడ పొగడితే.. నీకు తిండిపెడుతున్న నా మాతృగడ్డపై ఉండి దీన్ని పొగడవా? దీన్ని గౌరవించవా? అని అక్కడి వాళ్లు తన్ని తరిమేసే పరిస్థితి తెచ్చుకోవద్దు... నీ తల్లిని, నీ జాతిని ఎలాగూ నువ్వు చేసే మంచి పనులతో ఎవరైనా గుర్తిస్తారు... నీ జాతిని గౌరవిస్తారు.. నువ్వు ప్రత్యేకంగా నీకు నువ్వుగా గొప్పలు చెప్పుకోవడాలు, పొగుడుకోవడాలు అవసరం లేదు..
ఈ విషయంలో శివసేన దివంగత చీఫ్ బాల్ థాకరే భావన నాకు బాగా నచ్చింది..
ఎన్నారైలకు ఓటు హక్కు కల్పిస్తామని మూడేళ్ల క్రితం మన్మోహన్ అన్నప్పుడు బాల్‌థాకరే అగ్గిమీద గుగ్గిలం అయిపోయాడు... ఎన్ఆర్ఐల వద్ద డబ్బుందని ఓటు హక్కు ఇవ్వడం మంచిది కాదన్నాడు... వీలైతే ఎన్నారైలు ఇండియాకు వచ్చిన ఇక్కడి ప్రజలతో కొంత సమయం గడిపి వారికి మార్గనిర్దేశనం చేస్తే అది చాలన్నారు... ఇంకో సూచన కూడా ఇచ్చారు... ఎన్నారైలు నివసిస్తున్న దేశాన్నే మాతృదేశంగా పూజించాలని, ఆరాధించాలని స్పష్టం చేశారు.. అలా చేయకుండా రెండు దేశాల్లోనూ ప్రయోజనాలు ఆశిస్తే రెండు పడవల మీద కాలు వేసినట్లే అని హెచ్చరించారు..
అలా ఉంటే పరిణామాలు దారుణంగా ఉంటాయన్నారు..
అలా ఉంటే పరిణామాలు దారుణంగా ఉంటాయన్నారు..
No comments:
Post a Comment