1

1

Wednesday 10 September 2014

మీరు నిజంగా తెలంగాణ, ఆంధ్రా జ‌ర్న‌లిస్టులు ఉద్యోగ భ‌ద్ర‌త గురించి మీరు నిజంగా ఆలోచిస్తున్నారా?

తెలంగాణ బీజేపీ నాయ‌కులారా....!!
తెలంగాణ, ఆంధ్రా జ‌ర్న‌లిస్టులు ఉద్యోగ భ‌ద్ర‌త గురించి  ఆలోచిస్తున్నారా?


అయితే ప్ర‌ధాన ప‌త్రిక‌లో బ‌ల‌వంతంగా ఉద్యోగుల‌తో చేయిస్తున్న రాజీనామాల‌పై స్పందించండి... ప్ర‌ధాన ప‌త్రిక యాజ‌మాన్యం అరాచ‌కాల‌పై  నోరు తెర‌వండి....  బ‌ల‌వంతంగా, భ‌య‌పెట్టి 200 మంది సెక్యూరిటీ సిబ్బందితో   రాజీనామా చేయించిన వైనంపై నిల‌దీయండి....  ఆఫీసు బాయ్‌ల‌ను మాన్పిస్తున్న తీరును ప్ర‌శ్నించండి... ప్రాసెసింగ్ సిబ్బంది రాజీనామా చేయ‌క‌పోతే వారిని పోలీసు స్టేష‌న్లో ఖైదీల‌ను కూర్చోబెట్టిన‌ట్టు ఆఫీసు రూముల్లో  ఓ మూల‌న కూర్చోబెట్టి రోజంతా ఏ ప‌ని చెప్ప‌కుండా,  ఎక్క‌డికీ క‌ద‌ల‌నీయ‌కుండా వారిని మాన‌సికంగా  హింసిస్తున్న వైనంపై నోరు తెర‌వండి...  ఆర్టిస్టులు అవ‌స‌రం లేదు... ఫొటోగ్రాఫ‌ర్ల‌తో ప‌నిలేద‌ని..  వారిని బ‌ల‌వంతంగా రాజీనామా చేయాల‌ని రోజూ వేధిస్తున్న ఆ ప‌త్రిక తీరుపై బీజేపీ నేత‌లు యుద్ధం చేయ‌గ‌ల‌రా?

మీకు ద‌మ్ముంటే... మీరు నిజంగా ఉద్యోగుల భ‌ద్ర‌త కోస‌మే పోరాడే వారైతే... దాదాపు 1500 మందిని బ‌ల‌వంతంగా రాజీనామా చేయించి కాంట్రాక్టు ఉద్యోగులుగా మార్చుకుంటూ కార్మిక చ‌ట్టాల‌ను ఉల్లంఘిస్తున్న ప‌చ్చ ప‌త్రికాధీశుడి నిరంకుశ ధోర‌ణిపై  పోరాడండి... మీ పోరాటానికి తెలంగాణ ప్ర‌జ‌లే కాదు.. ఆంధ్రాలోనూ ఉన్న ఆ ప‌త్రిక సిబ్బంది మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తారు...  మీ పేరు చ‌రిత్ర పుట‌ల్లో నిలిచిపోతుంది...

ఎన్నిక‌ల స‌మ‌యంలో యాజ‌మాన్యం అజెండాయే త‌మ అజెండాగా... యాజ‌మాన్యం ఏది చెబితే అదే వేదంగా భావించి వారు ప‌నిచేశారు... బాబును గెలిపించేందుకు ప్ర‌య‌త్నించారు... బాబు వ‌స్తే జాబు వ‌స్త‌ద‌ని అంద‌రికీ న‌చ్చ‌జెప్పారు... కానీ బాబు వ‌స్తే త‌మ జాబులు పోతున్నాయేంట‌ని...  వాళ్లు లోలోన మ‌థ‌న ప‌డుతున్నారు...


ఇన్నేళ్లు నెత్తురు ధార‌పోసి ఈ స్థాయికి తెచ్చిన సంస్థ అర్ధంత‌రంగా త‌మ‌ను వెళ్లిపోమంటుంటే ఏం చేయాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు... వారంద‌రికీ న్యాయం చేసేందుకు మీరు కొట్లాడ‌టం లేదు  ఎందుకు?

దాదాపు 13 ఏళ్లుగా జ‌ర్న‌లిస్టుల‌కు వేజ్‌బోర్డు దిక్కులేక‌పోయినా మీరు ప‌ట్టించుకోరు... మజిథియా క‌మిటీ ఇచ్చిన సిఫార్సుల‌ను అమ‌లు చేయని ప‌త్రిక‌ల‌పై మీరు పోరాటం చేయండి...  ఎన్నిక‌ల వ‌ర‌కు ఉద్యోగుల‌ను పూర్తిగా వాడుకొని.. ఎన్నిక‌ల్లో త‌మ అనుకూల ప్ర‌భుత్వాలు గెలవ‌డంతో ఇష్టారీతిగా ప్ర‌వ‌ర్తిస్తున్న ప్ర‌ధాన ప‌త్రిక యాజ‌మాన్యం వైఖ‌రిపై స‌మ‌ర‌శంఖం పూరించండి... మీ వెంట మీముంటాం.... మీరు అలా చేయ‌గ‌ల‌రా... మీకు అంత ధైర్యం ఉందా?

No comments:

Post a Comment