1

1

Tuesday, 9 September 2014

చిన్న క‌థ‌.....!!

చిన్న క‌థ‌.....!!

ఇది చాలా ఏళ్ల క్రితం ముచ్చ‌ట‌... అన‌గ‌న‌గా ప్ర‌పంచంలోనే పెద్ద టెలిఫోన్ రంగ సంస్థల్లో అది కూడా ఒక‌టి.. అది అగ్ర‌రాజ్యానికి చెందిన సంస్థ‌.. ఆ సంస్థ‌కు ఇన్‌హౌజ్ మ్యాగ‌జైన్‌(ఆఫీసు ప‌త్రిక‌) ఒక‌టి ఉంది... అయితే అందులో సంస్థ విస్త‌ర‌ణ‌కు సంబంధించి ఒక వ్యాసం వ‌చ్చింది.. అందులో యూర‌ప్‌లో ప్ర‌జ‌లు ఆ సంస్థ సెల్‌ఫోన్ల‌ను వాడుతున్న‌ట్లు, అమెరికాలో, ఇత‌ర ఖండాల‌ ప్ర‌జ‌ల వ‌ద్ద ఆ సంస్థ సెల్‌ఫోన్లు ఉన్న‌ట్లు కార్టూన్ ఉంది.. అయితే ఆఫ్రికాకు వ‌చ్చే స‌రికి అక్క‌డ చింపాంజీల చేతిలో ఈ సంస్థ సెల్‌ఫోన్లు ఉన్న‌ట్లు కార్టూన్ వ‌చ్చింది... ఇది ఇన్‌హౌజ్ మ్యాగ‌జైన్‌.. బ‌య‌ట వాళ్ల‌కు ఎవ‌రికీ ల‌భించ‌దు... అయితే ఆ సంస్థ‌లో ప‌నిచేస్తున్న ఆఫ్రికా-అమెరికా సంత‌తి ప్ర‌జ‌లు ఆ కార్టూన్‌ను చూసి తీవ్రంగా ప్ర‌తిస్పందించారు.. ఆఫ్రికా ప్ర‌జ‌ల‌ను, త‌మ‌ను ఘోరంగా అవ‌మానించార‌ని ఆందోళ‌న చేశారు... చివ‌ర‌కు ఆ సంస్థ ఎన్నో క్ష‌మాప‌ణ‌లు చెప్పినా వాళ్లు శాంతించ‌లేదు.. కోర్టుల్లో కేసులు వేశారు.. ఆఫ్రికా-అమెరికా సంత‌తి ఉద్యోగుల‌కు త‌గిన ప్రాధాన్యం ఇస్తామ‌ని, వారి భాగ‌స్వామ్యాన్ని పెంచుతామ‌ని యాజ‌మాన్యం హామీ ఇచ్చింది... చివ‌ర‌కు ఆ వ‌ర్గాన్ని సంతృత్తి ప‌ర‌చ‌డానికి, వారికి చేరువ కావ‌డానికి టీవీ షోలు కూడా చేయించింది... అయినా ఉద్యోగుల మ‌న‌సుల‌ను గెల‌వ‌లేక‌పోయింది.. భారీగా న‌ష్ట‌ప‌రిహారం చెల్లించుకున్న‌ట్లు స‌మాచారం... ఆ ఆఫీసు ప‌త్రిక‌నూ మూసేసిన‌ట్లు వినికిడి...

ఇక్క‌డ సంస్థ అవ‌మానించింది అఫ్రికా ప్ర‌జ‌ల‌ను.. అది ఒక ఇన్‌హౌజ్ మ్యాగ‌జైన్‌లో... అది బ‌య‌ట ప్ర‌పంచానికి తెలియ‌దు...అయినా ఉద్యోగులు స్పందించారు.. ఒకవేళ సంస్థ‌కు వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తితే త‌మ ఉద్యోగాలు పోతాయ‌ని తెలిసినా... త‌మ జాతికి అవ‌మానం జ‌రిగింద‌ని ఆందోళ‌న చేశారు... చివ‌ర‌కు సంస్థ‌తో క్ష‌మాప‌ణ‌లు చెప్పించారు... ఉద్యోగాల్లో స‌ముచిత భాగ‌స్వామ్యం పొందారు... అంతేకానీ జాతికి అవ‌మానం జ‌రిగినా నోరుమూసుకుని కూర్చోలేదు....!!!

No comments:

Post a Comment