1

1

Tuesday, 9 September 2014

అప్ప‌టి ద‌మ‌న‌కాండ‌ను మీ క‌లాలు ఖండించ‌లేదు ఎందుకు?

తెలంగాణ ఉద్య‌మం జ‌రిగిన స‌మ‌యంలో తెలంగాణ ఎంపీలు, విద్యార్థులు, ఉద్య‌మ‌కారులు సీఎం క్యాంప్ ఆఫీసు, అసెంబ్లీ వ‌ద్ద నిర‌స‌న‌కు వెళితే... వారిని అరెస్టు చేసినా త‌ప్పుప‌ట్ట‌ని మీడియా సంస్థ అది... ఉస్మానియాలో మ‌హిళా విద్యార్థుల‌పై పాశ‌వికంగా దాడులు చేసినా నోరు తెరియ‌ని జ‌ర్న‌లిజం మాఫియా అది...  అసెంబ్లీ ముట్ట‌డికి వెళ్లిన వారిని ఇనుప కంచెల‌తో క‌ట్ట‌డి చేస్తే తెగ సంబ‌ర‌ప‌డిన ఉన్మాదులు వాళ్లు....


అప్పుడు పౌరుల హ‌క్కుల హ‌న‌నంపై ఆ మీడియా సంస్థ నుంచి ఒక్క క‌థ‌న‌మైనా వ‌చ్చిందా?     క‌నీసం ఇప్పుడు సీఎం ఇంటి వ‌ద్ద‌కు వీళ్లు స్వేచ్ఛ‌గా వెళ్లగ‌లుగుతున్నారు... నిర‌స‌న‌లు చేస్తే  పోలీసులు లాఠీఛార్జిలు చేయ‌కుండా, బాష్ప‌వాయువు గోళాలు ప్ర‌యోగించ‌కుండా మామూలుగానే అదుపులోకి తీసుకుంటున్నారు..  ఏ ఒక్క‌రిపైనా వంద‌ల‌కొద్దీ కేసులు న‌మోదు కావ‌డం లేదు....


ఒక‌సారి ఆంధ్రా పాల‌న‌లో తెలంగాణ పౌరుల‌పై సాగిన ద‌మ‌న‌కాండ మీరు చేస్తున్న‌ నిర‌స‌న‌ల‌పై ఉండ‌టం లేద‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోండి... ఒక‌సారి టేపులు తిర‌గేసి చూసుకోండి... అప్పుడు నిర‌స‌న‌ల‌ను ఎలా అణ‌చివేశారో మీకు క‌నిపిస్తుంది....
 మీకు ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వ పోక‌డ నిరంకుశంగా క‌నిపిస్తే.... మ‌రి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి, రోశ‌య్య పాల‌న‌లో తెలంగాణ స‌మాజంపై విరిగిన లాఠీలు, నిర్బంధాల‌ను ఎందుకు ఖండించ‌లేక‌పోయారు?    జ‌ర్న‌లిజంలో ఇదే నేర్పించారా?



No comments:

Post a Comment