నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీకి చేరుకుంటుంటే నీటి విడుదలను నిలిపివేశారు...
డెడ్ స్టోరేజీకి చేరుకున్న జలాశయం నుంచి ఒకవేళ తెలంగాణ వాళ్లు సాగు నీరు కోరితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుందా?
జలాశయం ఫుల్లుగా ఉన్నా కూడా ఇవ్వదు.. అలాంటిది కేటాయించిన నీరు కన్నా 44 టీఎంసీలు ఎక్కువగా వాడుకుంది..
మళ్లా నీళ్లు కావాలంటూ లొల్లి చేస్తోంది... తెలంగాణలో విద్యుత్ కొరత ఉంది.. రబీలో పంటలు వేసుకోవద్దు.. జలాశయాల్లోనూ నీళ్లు లేవని
కేసీఆర్ ధైర్యంగా రైతులకు చెప్పాలని ఇక్కడి టీడీపీ నేతలు, బీజేపీ నేతలు తెగ సూచనలు ఇచ్చారు..
వాళ్ల మాట విని కేసీఆర్ నిజంగానే రబీ వద్దన్నాడు.. మరి సాగర్, శ్రీశైలంలో ఈసారి నీళ్లు లేవు.. రబీలో వరి వేసుకోవద్దని ఆంధ్రా రైతులకు ఎందుకు చెప్పలేదు.. ఉల్టా మార్చి వరకు సాగు నీరు ఇస్తామని స్వయాన అక్కడి మంత్రి దేవినేని ఉమా ఎందుకు మభ్యపెట్టే హామీ ఇచ్చారు..?
నీళ్లు లేవు.. ఆరుతడి పంటలు వేసుకోమని చెబితే ఈ సమస్య ఉండదు కదా..!!
----------------------------
ఇప్పుడు దయ తలచి నీళ్లు ఇస్తే... మన కొంప కొల్లేరే...!!
మొన్నటి దాకా సాగు నీరులేక మన రైతులు చచ్చారు..
ఇక వేసవిలో తాగు నీరు దొరక్క జనం చస్తారు..
ఆంధ్రా ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగొద్దు...
-------------------------------------
ఓసారి ఢ్యాంను కేంద్రం తీసుకోవాలంటుంది.. ఓసారి తెలంగాణ ఇంజినీర్లపై అక్కడి నేతలతో దాడి చేయిస్తుంది.. తెలంగాణే ఎక్కువ నీరు వాడుకుంది అంటూ కేంద్రానికి ఫిర్యాదులు చేయడం, అనుకూల పత్రికల్లో వార్తలు రాయించడం చేస్తుంది.. ఇవన్నీ వర్కవుట్ కాకపోయే సరికి కాళ్ల బేరానికి రావడం.. తెలంగాణ తాగు నీటి అవసరాలను విస్మరించి ఇప్పడు నీళ్లు ఇస్తే రేపు వేసవిలో తాగు నీరు లేక తెలంగాణలో ప్రజలు చచ్చిపోతున్నారని వార్తలు రాయించి బద్నాం చేస్తారు.. సాగు నీరు ఇవ్వలేకపోయారు. కనీసం తాగునీరైనా ఇవ్వలేరా అంటూ విమర్శలు చేయిస్తారు.. అందుకే తెలంగాణ సర్కారు ఆంధ్రా విజ్ఞప్తులను పట్టించుకోవద్దు..
--------------------------
నోట్: ఆల్మట్టి మనకు నీటి విడుదలను ఆపేస్తే.. అక్కడి పత్రికలు మన ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయని వార్తలు రాస్తాయా?
కానీ ఈనాడు పత్రిక మాత్రం తెలంగాణ ప్రభుత్వం నీటి విడుదలను ఆపేస్తే.. ఆంధ్రా ప్రభుత్వం ఎంత మథనపడుతోందో రాస్తోంది..
పాపం ఏకకాలంలో ఇద్దరు చంద్రులను సంతృప్తి పరిచేందుకు ఆ పత్రిక పడుతున్న తాపత్రయం చూస్తుంటే నవ్వొస్తుంది..