దుమ్ముగూడెం-నాగార్జున సాగర్ టేయిల్‌పాండ్... ఇది తెలంగాణకు ఉపయుక్తమైన ప్రాజెక్టా కాదా? అన్నది తెలుసుకోవాలంటే... దాని లోతుల్లోకి వెళ్లనవసరం లేదు... ఒకసారి ఈనాడు పత్రిక తెలంగాణ ఎడిషన్, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూస్తే సరిపోతుంది... ఆంధ్రాకు పనికి రాని వార్తలను ఈ పత్రిక ఎప్పుడూ మొదటి పేజీలో వేయదు... అందులో తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ఎంత మాత్రం వేయదు... కానీ ఇటీవల కాలంలో తెలంగాణ వార్తలను ప్రముఖంగా ఈనాడు మొదటి పేజీలో వేసిన సందర్బాలు రెండు... అవి
ఒకటి ఉపకారత వేతనాలపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు పెట్టిన వార్త..
ఇంకోటి దుమ్ముగూడెం కు మంగళం అన్న వార్త...
ఇంకోటి దుమ్ముగూడెం కు మంగళం అన్న వార్త...
ఈ రెండు ఆంధ్రా ప్రాంతానికి మేలు చేకూర్చేవి కాబట్టి ప్రాధాన్యత అంశంగా వేసిందా పత్రిక...
ఇక దుమ్ముగూడెం రద్దు అని మనకు హెడ్డింగ్ పెడితే... ఆ ప్రాంతానికి వెళ్లే సరికి దుమ్ముగూడెంకు మంగళం అని రాసింది.... రద్దు, మంగళం ఈ రెండింటికీ వ్యత్యాసం ఏంటి....?
దుమ్ముగూడెం ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.20 వేల కోట్లు... ఇప్పటి వరకు రూ.750 కోట్లు వెచ్చించారు... ఈ ప్రాజెక్టు వల్ల మనకు ప్రయోజనం లేనప్పుడు మరో రూ.19 వేల కోట్లు మనం భరించడం అవసరమా?
ఇంకో కీలక విషయం... అప్పట్లో రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు కొట్లాడిన ప్రాజెక్టుల జాబితాలో ఇది కూడా ఉంది..... దుమ్ముగూడెం ఎలాగైన పూర్తి చేయించేలా కేంద్రం నుంచి హామీ ఇవ్వాలని ఆయన రాజ్యసభలో చాలా పట్టుపట్టారు..... ఇప్పుడు అర్థం అయి ఉంటుంది కదా ఇది మనకు లబ్ధి చేకూర్చని ప్రాజెక్టు అని.... దీన్ని పూర్తి చేయాలని రేపటి నుంచి తెలంగాణ బీజేపీ వాళ్లు, తెలంగాణ టీడీపీ వాళ్లు ఆందోళనలు చేసినా ఆశ్చర్యం లేదు.....
ఎవరు ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గొద్దు....
No comments:
Post a Comment