కేసీఆర్ గారికి విజ్ఞప్తి.....
ఢిల్లీ పురానా ఖిలా తరహా లైట్ అండ్ సౌండ్ షో(ఇష్క్ ఏ దిల్లీ) హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలి...
వీలైతే ప్రతి జిల్లాలోనూ ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి...
వీలైతే ప్రతి జిల్లాలోనూ ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి...
హైదరాబాద్ కేంద్రంగా జరిగిన చరిత్రాత్మక ఘటనలను, హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిన విధానాన్ని తెలియజేసేలా ఇది ఉండాలి...
తెలంగాణ పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా తెలంగాణ చరిత్రను విదేశీ, పొరుగు రాష్ట్రాల యాత్రికుల తెలియజేసేందుకు వీలుగా అత్యద్భుతమైన లైట్ అండ్ సౌండ్ షోను ఏర్పాటు చేయాలి... ఇలాంటి షో ఇప్పటికే ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు.. కానీ ఢిల్లీలోని పురానా ఖిలలో ప్రతి రోజూ సాయంత్రం దాదాపు గంట సేపు రెండు షోలను ప్రదర్శిస్తారు... అందులో ఢిల్లీ నగరాన్ని కేంద్రంగా చేసుకుని పాలించిన రాజవంశీయుల గురించి, ఢిల్లీ ఎలా పురోగతి చెందింది... ఢిల్లీలోని ప్రముఖ పర్యాటక స్థలాల ప్రాముఖ్యతను అద్భుతంగా వివరించారు.. దీన్ని భారత పర్యాటక శాఖ రూపొందించినట్లు తెలిసింది... ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌కు ఘనమైన చరిత్ర ఉంది... దాన్ని దేశ, విదేశీ పర్యాటకులకే కాకుండా స్థానికులకు తెలియజెప్పేందుకు దోహదపడుతుంది... ఈ షోను ఏర్పాటు చేయడానికి గోల్కొండ కోట, ఇతర కోటలను ఎంపిక చేస్తే బాగుంటుంది...
తెలంగాణ జిల్లాల్లోనూ వీటిని ఏర్పాటు చేసి... ఆయా జిల్లాల ప్రాముఖ్యతను తెలియజేస్తే బాగుంటుంది... నిపుణులైన వారితో దీన్ని రూపొందించాలి.. చరిత్రకారుల సహకారమూ తీసుకోవాలి.. వివాదరహితంగా కేవలం నగర ప్రాశస్త్రాన్ని తెలిపేందుకు ఈ లైట్ అండ్ సౌండ్ షోను ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా భావన.... పర్యాటక రంగ అభివృద్ధికి ఇది దోహదపడుతుంది... విదేశీ ప్రతినిధులు వచ్చినప్పుడు వారికి చూపించొచ్చు...
నోట్: లుంబినీ పార్కులో ఏర్పాటు చేసిన లేజర్ షోను చూడలేదు.. అందులో హైదరాబాద్ చరిత్రను ప్రతిబింబించే షో ఉందో లేదో తెలియదు.. ఒకవేళ ఉంటే.. దాన్ని మిగతా జిల్లాలకు విస్తృత పరచాలి..
No comments:
Post a Comment