1

1

Thursday, 9 October 2014

విద‌ర్భ‌ను వ‌దిలేసిన‌ట్లేనా...?

Modi for united Maharashtra, but BJP still in favour of smaller states
దీని అంత‌రార్థం ఏంటి?
విద‌ర్భ‌ను వ‌దిలేసిన‌ట్లేనా...?
మ‌హారాష్ట్ర‌ను విచ్ఛిన్నం చేయ‌ను.. అంటే విద‌ర్భ‌ను ఏర్పాటు చేయ‌న‌నే అర్థ‌మా?
మ‌రి చిన్న రాష్ట్రాల నినాదం ఏమైన‌ట్లు..
ఈ లెక్క‌న గూర్ఖాలాండ్‌కు మంగ‌ళ‌మేనా..
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఊసు ఎత్త‌రేమో...
అయినా ఇది వాజ్ పేయి లాగా సంకీర్ణ‌ణ‌ జ‌మానా కాదు క‌దా...
మోడీ గారు ఒక్క‌సారి క‌మిట్ అయితే మ‌రో ఎన్నిక‌ల వ‌ర‌కు ఎవ‌రు చెప్పినా విన‌రేమో...
బీజేపీ అధికారంలోకి వ‌స్తే విద‌ర్భ‌ను ప్ర‌త్యేక రాష్ట్రం చేస్తాం అని నితిన్ గ‌డ్క‌రీ గారు లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో అన్నారు... గ‌తంలో తెలంగాణ ఉద్య‌మంలో తారాస్థాయిలో ఉన్న‌ప్పుడు మ‌హారాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్‌ నేత‌లు కూడా తెలంగాణ బిల్లుతోపాటు విద‌ర్భ బిల్లు పెట్టాల‌ని గంద‌ర‌గోళం సృష్టించాల‌నే ప్ర‌య‌త్నం చేశారు... ఒకానొక ద‌శ‌లో విద‌ర్భ బిల్లు పెడితేనే తెలంగాణ‌కు మ‌ద్ద‌తు ఇవ్వాలంటూ డిమాండ్లు కూడా చేశారు.. ఇక ఇప్పుడు మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో విద‌ర్భ ఇస్తామ‌ని అన‌డం మాట అటు ఉంచితే... మ‌హారాష్ట్ర‌ను ఏ శ‌క్తి విడ‌దీయ‌లేదంటూ మోడీగారే స్వ‌యంగా సెల‌విచ్చారు..
మ‌రి మోడీ గారు ఈ ముక్క‌ను విద‌ర్భ ప్రాంతంలో ఎన్నిక‌ల ప్ర‌చారం స‌మ‌యంలో చెప్పి ఉంటే బాగుండేది క‌దా.. అక్క‌డ ఎందుకు అన‌లేదో ఆయ‌న గారే జ‌వాబు చెబితే బాగుంటుంది.. అంటే ఈ లెక్క‌న విద‌ర్భ పేరుతో ఇంత‌కాలం ఓట్లు అడుక్కుని అక్క‌డి ఓట‌ర్ల‌ను వంచించిన‌ట్లేనా... ఈ విష‌యంలో ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ కూడా మోడీ గారితో గొంతు క‌లిపారు.. కానీ కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ గారు మాత్రం... మోడీగారు ముంబ‌యిని మ‌హారాష్ట్ర నుంచి వేరు చేయ‌బోమ‌న్న‌ట్లుగా మోడీ మాట్లాడార‌ని స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేశారు... మేం ఇప్ప‌టికీ విద‌ర్భ‌కు క‌ట్టుబ‌డే ఉన్నామ‌ని ఆయ‌న న‌ష్ట‌నివార‌ణ కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు... అస‌లు ప్ర‌ధాని నోట అంత పెద్ద మాట వ‌చ్చాక ఎవ‌రెన్ని చెప్పినా జ‌నం వింటారా?
ఈసారి మ‌హారాష్ట్ర‌ ఎన్నిక‌ల్లో ఒక‌వేళ బీజేపీకి పూర్తి మెజారిటీ రాకుండా శివ‌సేన‌కు ఆధిక్యం వ‌స్తే.. త‌ప్ప‌నిస‌రిగా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి విద‌ర్భ క‌ల సాకారం అవుతుంద‌న్న న‌మ్మ‌కం నాకుంది... ఎందుకంటే కాంగ్రెస్‌, ఎన్సీపీ, బీజేపీలు క‌లిసి విద‌ర్భ‌ను వేరు చేసి శివ‌సేన‌ను దెబ్బ‌తీసినా ఆశ్చ‌ర్యం లేదు..
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 72 సీట్లు వ‌చ్చాయి కాబ‌ట్టి ఇప్ప‌ట్లో అక్క‌డ విభ‌జ‌న అంశం తెర‌మీద‌కు రాదు... ఒక‌వేళ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఏమైనా కింద మీద అయితే మేం చిన్న రాష్ట్రాల‌కు అనుకూలం... అంటూ అరిగిపోయిన‌ టేపు రికార్డును ఆన్ చేస్తారు.. విని మ‌నం న‌వ్వుకోవాలి...

No comments:

Post a Comment