1

1

Tuesday, 7 October 2014

ఈనాడును కుదుపేస్తున్న సంక్షోభం

- ఈ అర్ధ‌రాత్రికి తేల‌నున్న ఆదివారం సంచిక భ‌విత‌వ్యం
- చావో రేవో అంటున్న చీక‌టి సూర్యులు
ఎన్నో రాజ‌కీయ పార్టీలు, ప్ర‌భుత్వాలు చివ‌ర‌కు మ‌హా నేత‌ల వ్య‌క్తిగ‌త జీవితాల్లోనూ కుంప‌టి రాజేసి చ‌లి కాచుకున్న ఈనాడు యాజ‌మాన్యం తాజాగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జ‌ర్న‌లిస్టుల రూపంలో వ‌స్తుంద‌నుకున్న తిరుగుబాటు బావుటా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా చీక‌టి సూర్యులు ఎగుర‌వేశారు. అర్ధ‌రాత్రి అంద‌రూ ప‌డుకున్న స‌మ‌యంలో యంత్రాల ర‌ణ‌గొణ‌ధ్వ‌నుల మ‌ధ్య స్వేదాన్ని దార‌పోసి... ప్ర‌పంచానికి తాజా విష‌యాల‌ను అందించ‌డంలో కీల‌క పాత్ర పోషించే మిషిన్ సెక్ష‌న్ కార్మికులు శ‌నివారం రాత్రి ఆందోళ‌న‌కు దిగారు. తెలంగాణ, సీమాంధ్ర‌లోని అన్ని జిల్లాల్లో కార్మికులు స‌మ్మెకు దిగారు. తాము ఎనిమిది గంట‌ల ప‌నిచేస్తామ‌ని చెబుతున్నా యాజ‌మాన్యం మాత్రం ఐదు గంట‌లే ప‌ని చేయాల‌నే నిబంధ‌న విధించ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కార్మికులు ముందుగానే యాజ‌మాన్య కుట్ర‌ను ప‌సిగొట్టారు. గ‌తంలోనే శ‌నివారం వ‌ర‌కు గ‌డువు ఇచ్చినా స్పంద‌న లేక‌పోవ‌డంతో ప్రింటింగ్ మొద‌లుపెట్టేది లేద‌ని తేల్చి చెప్పారు. అన్ని ఈనాడు కార్యాల‌యాల్లో విధుల‌కు హాజ‌రుకాకుండా ప్రాంగ‌ణాల్లో ఆందోళ‌న‌కు దిగారు. ఎడిటోరియ‌ల్ మిత్రులు కూడా వారికి సంఘిభావంగా కొన్ని నిమిషాల పాటు ఆందోళ‌న‌లో పాల్గొన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు డీఎన్ ప్ర‌సాద్ వంటి పెద్ద‌లు రంగంలోకి దిగినా ఎలాంటి ఫ‌లితం లేదు. ప్ర‌స్తుతానికి యాజ‌మాన్యం నుంచి ఎలాంటి సానుకూల స్పంద‌న లేదు. ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే 12 గంట‌ల‌కు మొద‌లుకావాల్సిన ప్రింటింగ్ ప్ర‌శ్నార్థ‌కంగా మార‌నుంది. మ‌రి యాజ‌మాన్యం ప్ర‌త్యామ్నాయం (ఇత‌ర ప‌త్రిక‌ల స‌హ‌కారంతో) చూసుకుంటుందా?. అనే సందేహాన్ని కార్మికులు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే వాస్త‌వంగా అది సాంకేతికంగా ఏమాత్రం సాధ్యం కాక‌పోవ‌చ్చు. ఈ నేప‌థ్యంలో ఆదివారం ఎడిష‌న్ ఏమ‌వుతుంద‌నేది ఇప్ప‌టికైతే అనుమానంగానే ఉంది. ప‌రిస్థితులు కాస్త చ‌క్క‌బెడితే ఎడిష‌న్ ఆల‌స్య‌మయ్యేలా క‌నిపిస్తుంది. ఏదేమైనా ఇప్ప‌టివ‌ర‌కు ఒన్‌సైడ్‌వార్‌లా ఈనాడులో యాజ‌మాన్యందే పైచేయి ఉండేది. కానీ ఇప్పుడు కార్మికులు క‌డుపు మండి ఆందోళ‌న‌కు దిగ‌డం ఈనాడు చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం. ఈ ప‌రిణామాలు ఎక్క‌డికి దారితీస్తాయ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. రాజ‌కీయ పార్టీలు, ట్రేడ్ యూనియ‌న్స్, ఇత‌ర రంగాల వారు సంఘిభావం ప్ర‌క‌టిస్తే చీక‌టి కార్మికుల జీవితాల్లో వెలుగు నిండుతుంది. జై తెలంగాణ‌

No comments:

Post a Comment