రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత వెంటనే విజయాలు రావు... విజయాలు రాలేదని పార్టీని మూసుకోవడమో.. పక్క పార్టీవైపు తొంగిచూడటమో చేయడం మంచిది కాదు... అధికారమే పరమావధి కూడా కారాదు.. శివసేనను పెట్టిన తర్వాత దాదాపు 30 దశాబ్దాల తర్వాత అధికారం దక్కింది.. ఇక జార్ఖండ్ ముక్తి మోర్చా కూడా దాదాపు 30 ఏళ్లు కష్టపడింది.. ఇంకా అనేక పార్టీలు ఏళ్ల తరబడి నిరీక్షణ తర్వాతే గుర్తింపు తెచ్చుకున్నాయి.. కానీ ఎన్నికల సమయంలోనే పార్టీలను స్థాపించి.. ఎన్నికల అనంతరం మూసేసే వారికి గౌరవం ఉండదు... ఇది గుర్తుంచుకోవాలి... ఎన్నికలు ఉన్నా లేకున్నా జనంలో పార్టీ తరఫున కార్యకలాపాలు చేయాలి...
మొన్న తెలంగాణలో ఎన్నికల సమయంలో హడావుడి చేసిన వాళ్లు ఇప్పుడు కనుమరుగయ్యారు.. వాళ్లందరికీ ఒకటే విజ్ఞప్తి.. అంకితభావంతో ముందుకువెళ్లండి.. అవకాశం వెతుక్కుంటూ వస్తుంది...
No comments:
Post a Comment