1

1

Wednesday, 1 October 2014

జ‌ర్న‌లిస్టుల‌ కోసం కూడా నోటిఫికేష‌న్లు వేయండి..

కేసీఆర్ గారూ.. తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన్న క‌ళాకారుల‌కు ఉద్యోగాలు ఇస్తామ‌న్న నిర్ణ‌యం బాగుంది..
అలాగే ఉద్య‌మంలో క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రించిన‌ జ‌ర్న‌లిస్టుల‌ కోసం కూడా నోటిఫికేష‌న్లు వేయండి..
జ‌ర్న‌లిస్టులు, క‌ళాకారులు క‌లిస్తే జ‌నానికి స‌మాచారాన్ని చాలా స‌ర‌ళంగా, సులువుగా చేర‌వేస్తారు..
ప్ర‌భుత్వ ప‌థ‌కాల ప్ర‌చార క‌ర్త‌లుగా, ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య వార‌థులుగా ఉంటారు..
వ్య‌క్తుల కోసం, కార్పొరేట్ మీడియా సంస్థ‌ల ఎదుగుద‌ల‌ల‌ కోసం కొంద‌రు జ‌ర్న‌లిస్టులు మ‌న‌సు చంపుకొని ప‌నిచేస్తున్నారు..
అదే ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే అవ‌కాశం వ‌స్తే ఇంకా ఎక్కువ క‌ష్ట‌ప‌డ‌తారు..
ప్ర‌జా సంబంధాల అధికారులు, స‌హాయ ప్ర‌జా సంబంధాల అధికారులు పోస్టుల నియామ‌కాలు చేప‌ట్టండి..
ప్ర‌జ‌ల కోసం అందుబాటులో ఉన్న ప‌థ‌కాలేంటో ప్ర‌జ‌ల‌కు తెలిసేలా ప్ర‌చారం చేయండి..
ఉత్తుత్తి ప్ర‌చారాలు కాకుండా ప్ర‌భావ‌వంత‌మైన ప్ర‌చారం సాగాలి...
క్షేత్ర‌స్థాయిలోకి సంక్షేమ కార్య‌క్ర‌మాల వివ‌రాలు వెళ్లాలి...
సంక్షేమం కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు చేసినా స‌రే ఆ వివ‌రాలు, ప‌థ‌కాల స‌మాచారం పేదోడికి తెలియ‌క‌పోతే ఫ‌లితం ఉండ‌దు..
అందుకే ప్ర‌చారం కోసం నిధులు కేటాయించండి.. మీడియా ద్వారా కాకుండా సంప్ర‌దాయ క‌ళారూపాలైన బుర్ర‌క‌థ‌లు, జాన‌ప‌దాలు, క‌ళాజాత బృందాల ద్వారా గ్రామాల‌కు, తండాల‌కు సందేశాలు వెళ్లాలి..
చిన్న విజ్ఞ‌ప్తి..
జ‌ర్న‌లిస్టు జీవితం అనిశ్చితమ‌యం అయిపోయింది... చాలీచాల‌ని జీతాల‌తో క‌ష్టాల్లో ఉన్నారు కొంద‌రు నిజాయ‌తీప‌రులైన పాత్రికేయులు.. అలాంటి వారిని ఆదుకోవాలి... యాజ‌మాన్యాల వేధింపుల‌తో త‌నువు చాలిస్తున్న వాళ్లూ ఉన్నారు.. తెలంగాణ జ‌ర్న‌లిస్టు సంఘం ఆవిర్భావ స‌భ‌లో జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్లు క‌ట్టిస్తామ‌ని హామీ ఇచ్చారు.. అలాగే హైద‌రాబాద్‌లో అత్య‌ద్భుత‌మైన మీడియా సెంట‌ర్ నెల‌కొల్పుతామ‌న్నారు.. ఈ విష‌యాలపైన కూడా కార్యాచ‌ర‌ణ రూపొందించండి...

No comments:

Post a Comment