ఆ ఆటగాళ్లపై దేశ భక్తిపై రాయరేం?
ఒక్క సానియాపైనే అక్కసు ఎందుకో?
దేశం కోసం ఆసియా క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారిణి రోజూ తన దేశభక్తిని నిరూపించుకోవాలన్నట్లు మాట్లడటం సరికాదు..
------------------------------
మొన్న ఆసియా క్రీడలు జరిగాయి.. అందులో టెన్నిస్‌లో భారత్ తరఫున అగ్రశ్రేణి ఆటగాళ్లు పాల్గొనలేదు.. వాళ్లు ర్యాంకింగ్ కోసం ఆ టోర్నీకి డుమ్మా కొట్టారు.. ఇందులో లియాండర్ పేస్, సోమ్‌దేవ్ తదితరులు ఉన్నారు... మరి సానియా మీర్జా మాత్రం దేశం తరఫున పాల్గొన్నది... ఆమె దేశభక్తిని పదేపదే శంకించే మనుషులకు ఆమె టోర్నీలో పాల్గొని మిగతా వారు పాల్గొనని విషయం కనిపించలేదు ఎందుకు?
ఆసియా క్రీడల్లో దేశం తరఫున కొందరు క్రీడాకారులు పాల్గొనకపోవడంపై క్రీడాశాఖ కూడా సీరియస్ అయింది... అలాంటి క్రీడాకారులకు ఎలాంటి నజరానాలు, సాయం చేయబోమని హెచ్చరికలు చేసింది... ఇక కేంద్రం ఇచ్చే డబ్బులు ఎందుకు? మన వద్ద కోట్లు ఉన్నాయి కదా అని చెప్పి వరుసగా రెండో ఏడాది కూడా బీసీసీఐ క్రికెట్ జట్టును ఆసియా క్రీడలకు పంపలేదు.. అంటే డబ్బుల కోసమే క్రికెట్ ఉంది... క్రికెటర్లు డబ్బులు వచ్చే టోర్నీలు ఆడుతున్నారు... సానియా మిర్జాలాంటి వాళ్లు దేశం కోసం ఆసియా క్రీడల్లోపాల్గొని రెండు పతకాలు తెచ్చింది.. అయినా ఆమె దేశభక్తిపై అందరికీ రోజూ అనుమానాలేదు.. కారణం మతమా? ఇంకేంటి...
మరి క్రికెటర్ల దేశభక్తి, ఇతర ఆటగాళ్ల దేశభక్తి గురించి ఆలోచించరా?
-------------------------
ఏది ఏమైనా భారత్ తరఫున ఆడని క్రికెటర్లు, క్రీడాకారులకు అవార్డులు ఇవ్వొద్దని కేంద్రం యోచిస్తోంది.. ఇది మంచి పరిణామం...