1

1

Monday 5 January 2015

స‌మ‌స్త చ‌రిత్ర తెలిస్తేనే ప్ర‌జ‌లు చైత‌న్య‌వంతులు అవుతారు..!!

డ‌ల్హౌసీ రైలు మార్గం వేయించాడు...
విలియం బెంటింగ్ స‌తీ స‌హ‌గ‌మ‌నం నిషేధించాడు..
ఇంకో గ‌వ‌ర్న‌ర్ జ‌న‌ర‌ల్ వితంతు పున‌ర్ వివాహాల‌ను ప్రోత్స‌హించాడు..
మెకాలే విద్యా విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టాడు...
తంతి, త‌పాల‌ను బ్రిటీష్ వారు ప్రారంభించారు..
పారిశ్రామికీక‌ర‌ణ‌కు ఈ చ‌ర్య‌లు జ‌రిగాయి...
అదే స‌మ‌యంలో సిపాయిల తిరుగుబాటు, దాన్ని అణ‌చివేసి తీరు.. బెంగాల్ విభ‌జ‌న..
ఇవ‌న్నీ మ‌న చ‌రిత్ర పుస్తకాల్లో ఉన్న‌వే క‌దా... ఇవి చ‌దువుకుంటున్నాం క‌దా..
మ‌రి చరిత్ర నిండా బ్రిటీష్ దోపిడీ, బ్రిటీష్ అరాచ‌కాలు, బ్రిటీష్ దారుణాలు ఉండాలి క‌దా.. ఇవ‌న్నీ తొల‌గించాలి క‌దా... ఎందుకు తొల‌గించ‌లేదు...?
------------------------------
బ్రిటీష్ వాడు చెడ్డొడు.. చెడ్డొడు.. చెడ్డొడు అని చెబితే సరిపోయేది క‌దా...!!
బ్రిటీష్ వాళ్లు చేసిన అన్ని ప‌నుల‌ను మ‌నం చ‌దువుకుంటున్నాం... మ‌రి అలాగే తెలంగాణ చ‌రిత్ర మొత్తం ఉంటే త‌ప్పేం ఉంది...?
-----------------
తెలంగాణ‌లో తొలి విద్యా సంస్థ ఎప్పుడు మొద‌లైంది, తెలంగాణ‌లో విద్యుత్ వెలుగులు ఎలా వ‌చ్చాయి, సాయుధ తిరుగుబాటుకు కార‌ణం ఏంటి?
నిజాం పాల‌న‌లో జ‌రిగిన త‌ప్పులు ఏంటి? సైనిక చ‌ర్య ఎందుకు జ‌రిగింది? సైనిక చ‌ర్య‌లో ఎంత మంది చ‌నిపోయారు? సుంద‌ర్‌లాల్ క‌మిటీ నివేదిక ఎందుకు బ‌య‌ట‌కు రాలేదు... ఇలా అన్ని వివ‌రాలు ఉండాలి క‌దా... తెలంగాణ‌ను ఆంధ్రాలో క‌లిపేందుకు జ‌రిగిన ఎత్తుగ‌డ‌లు, విలీనం వ‌ల్ల క‌లిగిన దుష్ప్ర‌రిణాలు కూడా రాయాలి... స‌మ‌స్త చ‌రిత్ర తెలిస్తేనే ప్ర‌జ‌లు చైత‌న్య‌వంతులు అవుతారు..!!

No comments:

Post a Comment