1

1

Friday, 2 January 2015

దేశ విభ‌జ‌న‌కు కార‌కుడైనా వ్య‌క్తిని కీర్తించిన అద్వానీ చేత ఎవ‌రైనా క్ష‌మాప‌ణ చెప్పించారా?

కేసీఆర్ నిజాంను పొగిడితే ప్రో పాకిస్థాన్ అయిన నిజాంను కీర్తించార‌ని టైమ్స్ నౌ వాడు గ‌గ్గోలు పెడుతున్నాడు.. మైనారిటీ ఓట్ల కోస‌మే అని మండిప‌డుతున్నాడు... 
మ‌రి అదే పాకిస్థాన్ అనుకూల నిజాంను హైద‌రాబాద్ రాష్ట్రానికి ఆరేళ్ల పాటు రాజ్‌ప్ర‌ముఖ్ గా పెట్టిన విష‌యం ఈ ఛానెల్ విలేక‌రికి తెలియ‌దా? అప్పుడు కూడా మైనారిటీ ఓట్ల కోస‌మే అలా చేశారా? 
మ‌రి బీజేపీ సీనియ‌ర్ నేత‌, ర‌థ యాత్ర‌ల మూల‌పురుషుడు అద్వానీ గారు పాకిస్థాన్ వెళ్లి మ‌హ్మ‌ద్ అలీ జిన్నాను కీర్తిస్తే అది మైనారిటీల ఓట్ల కోసం కాదా?
దేశ విభ‌జ‌న‌కు కార‌కుడైనా వ్య‌క్తిని కీర్తించిన అద్వానీ చేత ఎవ‌రైనా క్ష‌మాప‌ణ చెప్పించారా?
పాకిస్థాన్ దేశీయుడిని కీర్తిస్తే త‌ప్పు కాదు కానీ.. తెలంగాణ‌లో నిజాం చేసిన మంచిని చెబితే త‌ప్పు అవుతుందా?
---------------------
నోట్‌: కేసీఆర్ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి నిజాంను పొగిడాడు.. నిజాం చేసిన మంచిని చెప్పాడు.. కొత్త‌గా ఓట్ల కోసం ఆయ‌న ఈ మాట‌లు అన‌డం లేదు.. టీడీపీతో జ‌త‌క‌ట్టిన‌ప్పుడు, కాంగ్రెస్‌తో క‌లిసి సాగిన‌ప్పుడు ఇవే మాట‌లు అన్నాడు... గ‌త 13 ఏళ్లుగా అంటునే ఉన్నాడు...
కేసీఆర్ కొమ‌రం భీమ్‌ను పొగుడుతాడు, కాళోజీని కీర్తిస్తాడు, దాశ‌ర‌థిని అభిమానిస్తాడు, జ‌య‌శంక‌ర్‌ను గురువుగా కొలుస్తాడు..

No comments:

Post a Comment