1

1

Monday 5 January 2015

60 ఏళ్ల క్రితం జ‌రిగిన చ‌రిత్ర‌ను ఎందుకు దాచిపెట్టారు..?

------
కేసీఆర్ నిజాం గొప్పోడు అని పొగుడుతున్నాడు... తెలంగాణ‌లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌లో ఆయ‌న కృషి అద్వితీయం అంటున్నాడు..
దాశ‌ర‌థి నిజాంకు వ్య‌తిరేకంగా పాట‌లు రాశాడ‌ని అంటున్నారు...
స‌ర్దార్ ప‌టేల్ మ‌హ‌నీయుడు అని పొగుడుతున్నారు ఇంకొంద‌రు... మ‌రి అదే ప‌టేల్ సైన్యం తెలంగాణ‌లో న‌ర‌మేథం సృష్టించింది.. తెలంగాణ యోధుల‌ను కాల్చి చంపింది అంటున్నారు కొంద‌రు వ్య‌క్తులు..
గ‌ద్ద‌ర్... ప‌టేల్ సైన్యంపై పోరాడిన వ్య‌క్తుల‌ను యోధుల‌గా కీర్తిస్తూ పాట క‌ట్టాడు..
--------------
సెప్టెంబ‌రు 17 విమోచ‌న అంటారు కొంద‌రు.. విలీనం అంటారు ఇంకొంద‌రు... లేదు విద్రోహ దినం అంటారు మ‌రికొంద‌రు... తెలంగాణ చ‌రిత్ర‌లో ఎందుకింత వైవిధ్యం... నిజాంను తిడ‌తారు బీజేపీ వాళ్లు, ప‌టేల్‌ను పొగ‌డుతారు, మ‌రోవైపు ప‌టేల్‌ను, నిజాంను ఇద్ద‌రినీ త‌ప్పుప‌డ‌తారు కొంద‌రు క‌మ్యూనిస్టులు...
మ‌రి నిజాంపై కొట్లాడిన క‌మ్యూనిస్టుల‌ను గౌర‌వించ‌డానికి బీజేపీ వాళ్ల‌కు మ‌న‌సు రాదు.. అలాగే బీజేపీ వాళ్లు మెచ్చుకుంటున్న కాంగ్రెస్ నేత ప‌టేల్‌ను ఆరాధించ‌డం క‌మ్యూనిస్టుల‌కు అంత‌గా న‌చ్చ‌దు... ఇవ‌న్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఎవ‌రు చెబుతారు...?
నిజాం ప్రైవేట్ సైన్యం చేసిన ఆగ‌డాలు ఏంటి... ప‌టేల్ సైన్యం చేసిన త‌ప్పు ఏంటి? అస‌లు ఏం జ‌రిగింది... ఎప్పుడో వెయ్యి సంవ‌త్స‌రాల క్రితం జ‌రిగిన చ‌రిత్ర‌ను మ‌నం తెలుసుకోగ‌లిగాం.. మ‌రి కేవ‌లం 60 ఏళ్ల క్రితం జ‌రిగిన చ‌రిత్ర‌ను ఎందుకు దాచిపెట్టారు..?
తెలంగాణ‌లో నిజాం పాల‌న‌పైనా, క‌మ్యూనిస్టుల పోరాటంపైనా, సైనిక చ‌ర్య‌పైనా పూర్తి చ‌రిత్ర ప్ర‌పంచానికి తెలియాలి..

No comments:

Post a Comment