ఓ అనుమానం...
శ్రీశైలంలోకి నిజంగానే 630 టీఎంసీలు వచ్చాయా?
మరి తెలంగాణ రైతులు ఎందుకు చనిపోయారు?
అంతగా వరద వస్తే విద్యుత్ ఉత్పత్తికి ఎందుకు అడ్డు చెప్పారు?
---------------------------
శ్రీశైలంలోకి జులై చివరి వరకు చుక్క నీరు రాలేదని అప్పట్లో ఈనాడు రాసింది..
ఖరీఫ్ ఖతం అని రాసింది.. రైతులు కూలీలయ్యారని రాసింది...
ఆగస్టు, సెప్టెంబరులోనూ ఆశించిన వర్షాలే పడలేదు..
అయితే నిన్న రాసిన వార్తలో మాత్రం ఈసారి అంచనాకు మించి నీళ్లు వచ్చాయని రాసింది..
ఏకంగా 630 టీఎంసీలు వచ్చిందని రాసింది..
అంటే ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులోనే నీళ్లు రావాలి కదా..
మరి అంతగా నీళ్లు వచ్చి ఉంటే తెలంగాణలో ఖరీఫ్‌లో నీళ్లు లేక రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నట్లు?
పచ్చ పత్రికల అంచనాల ప్రకారం అయితే 400 మంది రైతులు ఖరీఫ్‌లో తెలంగాణలో కన్నుమూశారు..
కారణం ఏంటంటే నీళ్లు లేక..?
మరి శ్రీశైలానికి భారీగా నీళ్లు వస్తే తెలంగాణ కాలువల్లోకి రాలేదా?
ఇంకో ముచ్చట... శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి ఉంటే కరెంట్ ఉత్పత్తికి అవకాశం ఉండేది కదా.
మరి 854 అడుగులకు పడిపోతుంది... నీళ్లు లేవు.. కరెంట్ ఉత్పత్తి చేయొద్దని నవంబరు, డిసెంబర్‌లో ఇదే పత్రిక వార్తలు రాసింది కదా..
నీళ్లు పుష్కలంగా వచ్చినప్పుడు నీటిమట్టం ఎక్కువనే ఉంటుంది కదా... ?
అంటే ఈ పత్రిక రిపోర్టర్‌కు తోచినప్పుడు నీటి మట్టం పెరగడం, తగ్గడం జరుగుతోందా?
ఇప్పుడు ఆంధ్రాకు నీళ్లు ఇప్పించాలనే కదా.. ఇంతగా తాపత్రయం...
నోట్: ఈసారి ఆశించిన వర్షపాతం లేనప్పుడు 630 టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో.. ఎక్కడికి పోయాయే...శ్రీశైల మల్లన్నకే ఎరుక.. !!
ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి.. ఉదాసీనంగా ఉంటే నీళ్ల దోపిడీ మళ్లా కొనసాగుతుంది... వీలైనంత త్వరగా ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయాలి.
నోట్: గతేడాది జులై చివరి వారంలో వచ్చిన వార్తలు, అలాగే నిన్న వచ్చిన వార్తను ఓసారి చూడండి..
No comments:
Post a Comment