ఇంటి పార్టీని ఆదరించిన ఓటర్లు...
------------------
------------------
కంటోన్మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, టీడీపీ-బీజేపీ కూటమికి చుక్కెదురైంది. దాదాపు అర్ధ శతాబ్దంగా కంటోన్మెంట్ ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకుంటున్న కాంగ్రెస్‌కు ఓటర్లు దిమ్మ దిరిగేలా తీర్పునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన ఎనిమిది నెలలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయాన్ని సాధించింది. ఆ పార్టీ అభ్యర్థులు నాలుగు చోట్ల గెలవగా, ఆ పార్టీ రెబల్స్ రెండు చోట్ల విజయం సాధించారు. టీడీపీ అధికారంలో ఉన్న 15 ఏళ్ల సమయంలోనూ టీడీపీ కంటోన్మెంట్‌లో పాగా వేయలేకపోయింది. కానీ అధికార టీఆర్ఎస్‌ను మాత్రం కంటోన్మెంట్ ప్రజలు ఆదరించారు. టీఆర్ఎస్ రెబల్స్ గెలిచిన రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు భార్యాభర్తలే కావడం విశేషం. వారు ఇతర పార్టీల నుంచి చివరి నిమిషంలో వచ్చి టీఆర్ఎస్ టికెట్లు సంపాదించుకున్నట్లు సమాచారం. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసే వారికి పట్టం కడతామని ఓటర్లు తీర్పునిచ్చారు.. గ్రేటర్ లో టీఆర్ఎస్‌కు బలమే లేదన్న బీజేపీ, టీడీపీలకు ఈ ఎన్నికలు గట్టి గుణపాఠాన్ని చెప్పాయి. ఒంటరిగా పోటీ చేసినా మంచి ఫలితాలు వస్తాయనడానికి ఇది మంచి ఉదాహరణ. చేస్తున్న పనులపై దృష్టి పెట్టాలి. ప్రజలు కంటోన్మెంట్‌లోనూ గెలిపించి మరింత బాధ్యత పెంచారు. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని కోరుకుంటున్నా. తెలంగాణ వాదమే టీఆర్ఎస్‌కు శ్రీరామరక్ష. తెలంగాణ ఆత్మగౌరవంతో ముందుకు వెళ్లాలితే ప్రజా ఆదరణ ఎప్పటికీ ఉంటుంది..!!
No comments:
Post a Comment