కేసీఆర్ గారికి చిన్న విజ్ఞప్తి..
మొక్కులు తీర్చుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం...
రాతి బొమ్మల్లో కొలువైన దేవుళ్ల మొక్కులే కాదు.. ముక్కోటి తెలంగాణ ప్రజల మొక్కులూ తీర్చుకోవాలి సార్...
గత 14 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్న జాతీయ నేతలకు ఆత్మీయ సన్మానమూ చేయాలి...!
---------------------------
తెలంగాణ రాష్ట్రం రావాలని గత పదేళ్లుగా దేవుళ్లకు కూడా మొక్కుకున్నట్లు కేసీఆర్ చెప్పారు.. ఇప్పుడు రాష్ట్రం సిద్దించినందుకు ఆ మొక్కులను తీర్చుకుంటున్నట్లు వెల్లడించారు.. తిరుపతి దేవుడికి రూ.5 కోట్లతో ఆభరణాలు, విజయవాడ అమ్మవారికి ముక్కు పుడక, భద్రకాళి అమ్మవారికి స్వర్ణ కిరీటం, మల్లన్నకు బంగారు మీసాలు, అజ్మీర్ ధర్గాలో చాదర్ సమర్పించడం, భక్తుల కోసం వసతి గృహ నిర్మాణం చేపట్టనున్నట్లు కేసీఆర్ గారు ప్రకటించారు..
ఇది మంచి విషయమే.. అయితే రాతి బొమ్మల్లో కొలువైన దేవుళ్లే కాకుండా.. ఈ 14 ఏళ్లుగా మీకు అండదండగా ఉన్న తెలంగాణ ప్రజాదేవుళ్ల మొక్కులను కూడా త్రికరణ శుద్ధిగా తీర్చుకోవాలి.. ఓటేసి మీకు అధికారం ఇచ్చిన ఓటరు దేవుళ్ల కోరికలన్నింటినీ తీర్చాలి.. రాతి బొమ్మల్లోని దేవుడికి ఆగ్రహం వస్తుందో లేదో తెలియదు కానీ.. ఓటరు దేవుడికి ఆగ్రహం వస్తే అసలుకే ఎసరు.. వాళ్లను ఎప్పుడూ కూడా ఆగ్రహానికి గురిచేయొద్దని మనవి...
------------------------------------------------
తెలంగాణ ఉద్యమ సమయంలో అడుగడుగునా అండగా నిలబడిన పార్టీలైన ఆర్జేడీ, బీఎస్పీ, ఎల్జేపీ, ఎన్సీపీ తదితర పార్టీల జాతీయ అధ్యక్షులు/ సీనియర్ నేతలను తెలంగాణకు రప్పించి ఆత్మీయ సన్మానమూ చేయాలని విజ్ఞప్తి...
ఇంకా చెప్పాలంటే సోనియాగాంధీ, సుష్మా స్వరాజ్, మీరా కుమార్, కురియన్‌లను ఇక్కడి ఆహ్వానించి సన్మానించినా తప్పులేదని నా భావన...

No comments:
Post a Comment