1

1

Friday 2 January 2015

జ‌ర్న‌లిస్టు సంఘం నాయ‌కులారా... ఎక్క‌డున్నారు...

జ‌ర్న‌లిస్టు సంఘం నాయ‌కులారా...
ఎక్క‌డున్నారు... ఓ మ‌హిళా జ‌ర్న‌లిస్టుపై ఇలా వేధింపుల‌కు పాల్ప‌డుతుంటే మీరు ధ‌ర్నాలు చేయ‌రా...? నిర‌స‌న‌లు తెల‌ప‌రా?
ద‌మ్మున్న ఛానెల్ ఏం చేస్తోంది(కొంప‌దీసి రాజీ కుదిర్చే ప‌నిలో లేదు క‌దా..), మెరుగైన స‌మాజం కోసం అన్న వాళ్లు ఎక్క‌డ ఉన్నారు.. అస‌లే పాత్రికేయ రంగంలో త‌క్కువ మంది మ‌హిళ‌లున్నారు.. వారికీ భ‌ద్ర‌త లేక‌పోతే ఇంకెవ‌రు ఈ రంగం వైపు చూస్తారు.. బాధితురాలికి న్యాయం చేయండి... ప్ర‌తీ మీడియా సంస్థ‌లోనూ మ‌హిళా భ‌ద్ర‌త కోసం, వేధింపుల నిరోధానికిచ‌ర్య‌లు తీసుకోండి... అంతేకానీ మీ స్వార్థం కోసం ధ‌ర్నాలు చేయ‌డం, స్వీయ‌ సంకెళ్లు చేసుకోవ‌డం అపండి మ‌హాశ‌యా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన మ‌హిళా ఎంపీ రాజీ కుదుర్చాల‌ని చూస్తున్న‌ట్లు ఈ వార్త‌లో సారాంశం.. దీన్ని మీ ప‌త్రిక‌ల్లో, ఛానెళ్ల‌లో చూపండి.. ఆమెకు న్యాయం జ‌రిగేలా చూడండి...!!
-------------------------
ఇక భార‌త‌దేశంలోని ప్రెస్ కౌన్సిల్‌కు ఇవ‌న్నీ ప‌ట్ట‌నే ప‌ట్ట‌వు... ముఖ్య‌మంత్రి కేసీఆర్ అనే వ్య‌క్తి అన్న మాట‌లే వినిపిస్తాయి.. దానిపై ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన వ‌క్రీక‌ర‌ణ‌లే వేద వ‌చ‌నాలుగా క‌నిపిస్తాయి... వెంట‌నే క‌మిటీ వేస్తారు.. నివేదిక‌లు తెప్పించుకుంటారు.. కానీ చంద్ర‌బాబుపై తాము ఒక క‌మిటీ వేశామ‌ని.. ఆయ‌న మీడియా స్వేచ్ఛ‌ను హ‌రిస్తున్నారో లేదో నిర్ధ‌రించుకొని ర‌మ్మ‌న్నామ‌న్న విష‌యాన్ని ప‌ట్టించుకోదు... ఇదేం ప్రెస్ కౌన్సిలో... ఈ కౌన్సిల్ యాజ‌మాన్యాల ప‌క్ష‌మే కాని పాత్రికేయుల ప‌క్షం ఉండేలా క‌నిపించ‌డ‌మే లేదు...
నోట్‌: కొంచెం ప్రెస్ కౌన్సిల్‌ను కూడా బ‌లోపేతం చేస్తే బాగుంటుంది.. బ‌లోపేతం అంటే పేరు మార్చ‌మ‌ని మాత్రం కాదండీ... మ‌ళ్లీ త‌ప్పుగా అర్థం చేసుకొని హిందీలో పేరు మార్చి గొప్ప ప‌నిచేశామ‌ని చంక‌లు గుద్దుకుంటార‌ని భ‌యం కూడా ఉంది..!!

No comments:

Post a Comment