1

1

Friday 2 January 2015

నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు...

మిత్రులంద‌రికీ(మీకు, మీ కుటుంబ స‌భ్యులంద‌రికీ) నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు... కొత్త సంవ‌త్స‌రంలో మీరు వ్య‌క్తిగ‌త విజయాలను సాధించాల‌ని, మీ ల‌క్ష్యాల‌ను అధిగ‌మించాల‌ని.. అలాగే తెలంగాణ అభివృద్ధిలోనూ మీ వంతు పాత్ర పోషించాల‌ని కోరుకుంటున్నాను.. 2014 ఎన్నో తీపి జ్ఞాప‌కాల‌ను, చ‌రిత్రాత్మ‌క విజ‌యాల‌ను మ‌న‌కు మిగిల్చింది.. ఇందులో తెలంగాణ సాధ‌నే అత్య‌ద్భుత‌మైన విజ‌యం. ఇక ఎన్నిక‌ల్లో ఆంధ్రా పార్టీల ఆట‌క‌ట్టించ‌డం మ‌రో గొప్ప సంఘ‌ట‌న‌.. ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా తెలంగాణ పాల‌కులు బంగారు తెలంగాణ కోసం నిరంత‌రం కృషి చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నా.. తెలంగాణ ద‌శ‌-దిశకు కీల‌క‌ దిక్సూచీగా 2015 సంవ‌త్స‌రం మారుతుంద‌ని న‌మ్ముతున్నాను.. ఇది స‌వ్య దిశ‌లో ముందుకు వెళ్లాల‌ని ఆకాంక్షిస్తున్నాను.. తెలంగాణ సాధ‌న క‌న్నా గొప్ప విజ‌యాల‌ను మ‌నం సాధించాలి.. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ‌ను నిల‌పాలి.. ఈ క‌ల‌ను కేసీఆర్ ఒక్క‌డే సాకారం చేస్తాడ‌ని చేతులు ముడుచుకు కూర్చోవ‌ద్దు.. మంత్రులు కూడా వినూత్న ఆలోచ‌న‌ల‌తో ప‌థ‌కాలు రూపొందించాలి. అంకిత‌భావంతో త‌మ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించాలి... అవినీతిని ద‌రిచేర‌నివ్వొద్దు.. ఉద్యోగులు కూడా కేవ‌లం జీతం కోస‌మే కాకుండా తెలంగాణ ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నింపేలా ప‌నిచేయాలి... క‌రెంట్ స‌మ‌స్య ఎలా ఉంటుందో అన్న భ‌యం న‌న్ను వెంటాడుతోంది.. ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ముందుకు వెళ్ల‌క‌పోతే ప్ర‌భుత్వానికి ఇబ్బంది త‌ప్ప‌దు... !!
-----------
తెలంగాణ ప్ర‌భుత్వం విద్యార్థులు, రైతులు, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చాలి... ముఖ్యంగా తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఛైర్మ‌న్‌గా నియ‌మితులైన ఘంటా చ‌క్ర‌పాణిగారు వీలైనంత త్వ‌ర‌గా నోటిఫికేష‌న్ల‌ను విడుద‌ల చేసేలా చూడాలి.. నిరుద్యోగులు కేవ‌లం రాష్ట్ర ఉద్యోగాల కోస‌మే కాకుండా జాతీయ స్థాయి ఉద్యోగాలు, కేంద్ర స‌ర్వీసు పోస్టుల‌కు పోటీ ప‌డాలి... అంద‌రికీ మంచి జ‌ర‌గాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా..
-------------------------
ఎన్ని విజ‌యాలు సాధించినా ఎన్ని మైలురాళ్ల‌ను అధిగమించినా తెలంగాణ కోసం అమ‌రులైన వారిని మాత్రం మ‌ర‌వొద్దు.. వారిని నిత్యం స్మ‌రించుకోవాలి... వారి ఆశ‌య సాధ‌న‌కు కృషి చేయాలి.. వారి యాదిలోనే మ‌న ప్ర‌స్థానం సాగాలి...
జై తెలంగాణ జై జై తెలంగాణ‌ !!

No comments:

Post a Comment