కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాకు నిధులు ఇవ్వడం లేదని కొందరు సంతోషిస్తున్నారు.. వాస్తవానికి కేంద్రం తెలంగాణకు కూడా రిక్తహస్తమే చూపుతోంది.. మనకు కూడా సరిగా నిధులు ఇవ్వడం లేదు.. మనకు రావాల్సిన నిధుల్లో 33 శాతమే వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి... ఫలితంగా చాలా పథకాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను కేంద్రం నుంచి తీసుకోవడం రాష్ట్రాల హక్కు.. ఈ విషయంలో ఆంధ్రాకు నిధులు ఇవ్వడం లేదని మనం సంతోషించడం, తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని వాళ్లు సంతోషిస్తే ప్రయోజనం ఉండదు... కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఎట్టి పరిస్థితుల్లోనైనా రాబట్టుకోవాలి.. ఇందు కోసం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు సమష్టిగా కేంద్రంపై ఒత్తిడి పెంచాలి.. లేకపోతే అభివృద్ధిలో వెనకబడిపోతాం...!!
మీరు నిజం చెప్పారు!
ReplyDeleteఈ మాట నాకు నచ్చింది!!