1

1

Saturday, 24 January 2015

ఆంధ్రాలో జ‌ర్న‌లిస్టుల‌కు ర‌క్ష‌ణ క‌ర‌వు..


ప్రెస్‌ కౌన్సిల్‌కు 6 వారాల్లో జర్నలిస్టులపై దాడుల నివేదిక : నిజనిర్ధారణ కమిటీ వెల్లడి
కెఎన్‌ఎన్‌ ప్రతినిధి, గుంటూరు:గుంటూరు జిల్లాలో జర్నలిస్టులపై జరిగిన దాడులకు సంబంధించిన విచారణ నివేదికను 6 వారాల్లో ప్రెస్‌ కౌన్సలర్‌ ఛైర్మన్‌కు అందజేస్తామని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఎన్‌. రామచంద్రరావు తెలిపారు. బుధవారం జిల్లా పరిషత్‌ సమావేశపు మందిరంలో రామచంద్రరరావుతోపాటు కమిటీలోని ప్రకాష్‌దూబే, అమర్‌ నాథ్‌లు జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, హత్యలకు సంబంధించి బహిరంగ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా రామచంద్రరావు విలేకర్లతో మాట్లాడుతూ చిలకలూరిపేటలో శంకర్‌హత్య, వినుకొండలో స్టీఫెన్‌బాబుపై దాడికి సంబంధించిన విచారణ నిర్వహించామన్నారు. వీటితోపాటు తమ దృష్టికి వచ్చిన జర్నలిస్టులపై జరిగిన దాడులు, వేదింపుల గురించి ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా దృష్టికి తీసుకువస్తామన్నారు. జర్నలిస్టులతోపాటు పోలీసు అధికారుల నుంచి కూడా జరిగిన ఘటనలపై అభిప్రాయాలు తీసుకోని ఛైర్మన్‌కు నివేదిస్తామన్నారు. గుంటూరు జిల్లాలో రాజధాని ఏర్పాడనున్న నేపధ్యంలో మీడియాపై జరిగిన దాడిని కూడా ఛైర్మన్‌ దృష్టికి తీసుకువెళతామన్నారు. జరిగిన ఘటనలపై రెండ్రోజులుగా అనేక కోనాలు, అంశాలపై వి చారణ చేయడం జరిగిందన్నారు. త్రిసభ్య కమిటీ వినుకొండ, చిలకలూరిపేటతోపాటు ఇటీవల కాలంలో గుంటూరు జిల్లాలో జరిగిన దాడులపై కూడా ప్రెస్‌ కౌన్సిల్‌కు నివేదిక అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు జరిగిన ఘటనలపై తమ అభిప్రాయాలను నిజ నిర్ధారణ దృష్టికి తీసుకువచ్చారు. చిలకలూరిపేట జర్నలిస్టు శంకర్‌ దారుణ హత్యకు సంబంధించి సూత్రదారులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్‌లో జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప టిష్టమైన చట్టాలను రూపొందించే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు ఈ సందర్భంగా నిజ నిర్ధారణ దృష్టికి తీసుకువచ్చారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో మీడియా వ్యవహరించే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టాలని కోరారు.
-------------------------------------------------
నవంబ‌రు నెల‌లో గుంటూరు జిల్లా లో ఓ విలేక‌రి హ‌త్య‌కు గుర‌య్యాడు.. ఎన్ని ప‌త్రిక‌ల్లో ప్ర‌ధాన పేజీలో వ‌చ్చింది... రాదు.. గుంటూరులో జ‌ర్న‌లిస్టుల‌పై దాడులు పెరిగాయ‌ట‌... ఇవ‌న్నీ రావు.. ఈ హత్య‌లు, దాడుల‌పై ప్రెస్ కౌన్సిల్ ఓ నిజ‌నిర్దార‌ణ క‌మిటీ వేసింది... ఈ విష‌యాన్ని
ద‌మ్ము ఛానెల్‌, మెరుగైన స‌మాజం కోసం త‌ప్పించే వాళ్లు ఎవ‌రూ ప్ర‌ముఖంగా చూప‌రు.. పాత్రికేయుల‌పై ఓ ప్రాంత సీఎం ఇలా అన్నాడ‌ని చేసిన‌
హ‌డావుడి అంతా ఇంతా కాదు.. కానీ మ‌రో ప‌క్క‌న‌ ఏకంగా పాత్రికేయుల‌నే హ‌త‌మారుస్తున్నా
ఎవ‌రూ నోరు మెద‌ప‌రు... పాత్రికేయులంతా మా కుల‌మే అన్న కించిత్ భావ‌న అయినా ఉంటే ఈ ఘ‌ట‌న‌ల‌ను ముక్త కంఠంతో ఖండించే వారు.. అది జ‌ర‌గ‌లేదు.. ఎందుకు? ఎవ‌రి స్వ ప్ర‌యోజ‌నాలు వారివి..
నిఖార్సైయిన పాత్రికేయ‌మే అయితే ఎక్క‌డో ఫ్రాన్స్‌లో జ‌ర్న‌లిస్టుల‌పై దాడుల‌ను ప్ర‌ముఖంగా చూప‌డం క‌న్నా ఇక్క‌డ జ‌ర్న‌లిస్టుల ప‌రిస్థితి ఏంటో ఆలోచించుకోండి.. మొన్న‌టికి మొన్న ఓ ఛానెల్‌లో మ‌హిళా ఉద్యోగినికి లైంగిక వేధింపులు.. ఇంకో పేప‌ర్ లో కార్మిక చ‌ట్టాల‌ను ఉల్లంఘించి య‌థేచ్చ‌గా ఉద్యోగుల తొల‌గింపు.. ఇవ‌న్నీ మీ పాత్రికేయుల‌కు జ‌రుగుతున్న అన్యాయాలే.. వీటిపైన కూడా రోడ్డెక్కండి.. ఓ వ్యాఖ్యాలు రాజ్యాంగ‌ వ్య‌తిరేక‌మ‌ని స్వేచ్ఛ‌గా ధ‌ర్నాలు చేసిన వాళ్లంతా కూడా రోజు ప‌త్రిక‌ల్లో, మీడియా సంస్థ‌ల్లో అణ‌చివేత‌కు గుర‌వుతున్న పాత్రికేయుల త‌ర‌ఫున‌ కూడా అంతే స్వేచ్ఛ‌గా గొంతెత్తండి.. యాజ‌మాన్యాల కోసం గొంతెత్తితే మీ అస్థిత్వానికే ముప్పు..
---------------------------------------
ప్రెస్ కౌన్సిల్ తెలంగాణ‌లో సీఎం వ్యాఖ్య‌ల‌పై మాత్రం ఆగ‌మేఘాల‌పై విచార‌ణ చేసి నివేదిక ఇచ్చింది.. ఇక ఆంధ్రా సీఎం జ‌ర్న‌లిస్టుల‌ను ప్రెస్ మీట్ల‌కు రానివ్వ‌కుండా అడ్డుకోవ‌డంపై నివేదిక‌కు
దిక్కు మొక్కు లేద‌.. అడిగే నాథుడే లేడు.. నాకు తెలిసి.. ఈ ఆంధ్రా ప్ర‌భ విలేక‌రి హ‌త్య కేసులోనూ 6 వారాల్లో నివేదిక వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం అయితే లేదు.. అడిగే వాళ్లు కూడా లేరు.. మొక్కు బ‌డి విచార‌ణ‌లు ఎందుకు చేస్తారో?

No comments:

Post a Comment