1

1

Wednesday, 14 January 2015

అప్పుడు ఎమ్మార్వో అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను కూల్చేసింది

నిజంగా చిత్ర‌న‌గ‌రిలో ఆక్ర‌మ‌ణ‌లు జ‌ర‌గ‌క‌పోతే అప్పుడు  ఎమ్మార్వో అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను కూల్చేసింది ఎందుకు?  నిజ నిర్ధ‌ర‌ణ‌లు జ‌రిగింది ఎందుకు?  మావోయిస్టులు త‌మ డిమాండ్ల‌లో రాజ‌గురువు ఆస్తుల ప్ర‌స్తావ‌న ఎందుకు తెచ్చారు? నిజంగా ప్ర‌భుత్వం త‌న నిర్మాణాల‌ను అక్ర‌మంగా కూల్చి త‌ప్పు చేసి ఉంటే ప‌రిహారం కోరుతూ రాజ‌గురువు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లే వాడు కాదా?   విశాఖ‌లో అద్దెకిచ్చిన కొంప‌నే అక్ర‌మించుకోవాల‌నుకున్న పెద్ద మ‌నిషి స‌క్ర‌మంగా ఉండి ప్ర‌భుత్వంతో న‌ష్ట‌పోయి ఉంటే ఎందుకు నోరుమూసుకు ఉంటాడు...?   చిత్ర‌న‌గ‌రి ప‌క్క‌నే ఉండే ప్ర‌జ‌లు పిచ్చోళ్లా ఆందోళ‌న చేయ‌డానికి... ?
--------------------
చిత్ర న‌గ‌రి తెలంగాణ‌కే త‌ల‌మానికం అన్న‌ప్పుడు ఎంద‌రు తెలంగాణోళ్ల‌కు ఉపాధిని చూపిందో క‌నీసం తెలుసుకోవాల‌న్న ఆలోచ‌న లేదా?
అక్క‌డ నియామ‌కాల కోసం ఆంధ్రా ప్రాంతంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో క్యాంప‌స్ సెల‌క్ష‌న్లు చేసి ఇక్క‌డికి తెచ్చుకోవ‌డం వాస్త‌వం కాదా?
క‌నీసం ఆయ‌న కంపెనీల్లో తెలంగాణ‌ వాళ్లు 10 శాతం(అది కూడా గ్రేడ్ 3, 4లోనే) కూడా లేర‌ని తెలియ‌దా?   తెలంగాణ యువ‌త చ‌నిపోతే ఒక్క రూపాయి సేక‌రించి ఇవ్వ‌ని ప‌త్రిక అది.. అదంతా ఎందుకు?   మొన్న‌టికి మొన్న తెలంగాణ‌లో తీవ్ర విద్యుత్ కోత‌ల‌తో పొలాల‌కు నీళ్లు అంద‌క రైతులు చ‌నిపోతుంటే.. శ్రీ‌శైలం నీటిని ఉప‌యోగించుకొని విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తే ఆక్షేపించిన ప‌త్రిక అది... శ్రీ‌శైలం అడుగంటుతోంద‌ని  క‌థ‌నాలు రాసి ఆంధ్రా స‌ర్కారుకు వంత‌పాడిన తీరును ఎలా మ‌ర‌చిపోతారు...?
త‌న ప‌త్రిక‌లోని తెలంగాణ ఉద్యోగుల‌ను అక్ర‌మంగా తొల‌గించిన తీరును ఎలా మ‌ర‌చిపోతారు..?   కార్మిక చ‌ట్టాల ఉల్లంఘ‌న‌ను ఎలా విస్మ‌రిస్తారు..?
తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కాంగ్రెస్‌ను బ‌లోపేతం చేస్తాం... అని కేసీఆర్ అన్న‌ట్లుగా త‌ప్పుడు వార్త‌ను రాసిన ప‌త్రిక అది...  ఆనాడు నిజామాబాద్‌లో నెహ్రూ ఏమ‌న్నాడు?  అంటూ తెలంగాణ‌, ఆంధ్రాది వివాహ బంధం అన్న మాట‌ను నెహ్రూ అన‌లేదు అని చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించింది ఈ ప‌త్రిక క‌దా?  అంతెందుకు ఈ ఏడు నెల‌ల కాలంలో వ‌చ్చిన కుట్ర క‌థ‌నాలు ఎన్నెన్నో... అన్నీ మీరు మ‌ర‌చిపోవ‌చ్చు గాక‌... ప్ర‌జ‌లు  మ‌ర‌వ‌లేరు...
------------
రాజ‌గురువు మిమ్మ‌ల్ని ఎంట‌ర్‌టెయిన్ చేయ‌డం శాశ్వ‌తం కాదు.. ఎందుకంటే వారి శాశ్వ‌త మిత్రులు వేరే ఉన్నారు... ఆట‌లో అర‌టిపండులా... కూర‌లో క‌రివేపాకులా వాడుకొని వ‌దిలేయ‌డంలో వాళ్లు ఉద్ధండ పిండాలు... వాళ్ల అవ‌స‌రం మేర‌కు  ఎన్టీఆర్‌, గోశ‌య్య‌తో దోస్తీ చేశారు...
ఛీప్ విప్పు త‌ప్పు త‌ప్పు అంటూ క‌థ‌నాలు రాసిన చేతుల‌తోనే న‌ల్లికుట్లోడికి జేజేలు ప‌లికారు.. అవ‌స‌రం తీరాక గోదారిలో క‌లిపారు..
అవ‌స‌రం దొరికితే ప్ర‌భుత్వాల‌ను అస్థిర ప‌చ‌డం వారి నైజం... అలాంటి వారికి క్లీన్ చిట్ ఇస్తే భ‌విష్య‌త్తులో మ‌న గోతి మ‌న‌మే తీసుకున్న‌ట్లు అవ‌డం ముమ్మాటికీ ఖాయం...
----------------

ఈ  రోజు ఏ తెలంగాణ ప్ర‌జ‌లైతే ఓట్లేశారో వారి నోటిని మించిన ప్ర‌చార సాధ‌నం ఇంకోటి ఉండ‌దు... ఎంత పెద్ద మీడియా సంస్థ‌యినా, ఇంకోటైనా ఇచ్చే ప్ర‌చారం క‌న్నా నిజాయ‌తీ ప‌రుడైన తెలంగాణ వ్య‌క్తి మ‌న‌సులో నుంచి వ‌చ్చే నోటి మాట‌ను మించిన మీడియా ఇంకోటి వ‌ద్దు..  ఎన్నిక‌ల ముందు ఒక‌లా.. ఎన్నిక‌లు అయ్యాక ఒక‌లా.. ఎన్నిక‌లు రెండేళ్ల‌లో ఉన్నాయ‌న‌ప్పుడు ఒక‌లా వ్య‌వ‌హ‌రించే మీడియా సంస్థ‌ల‌తో సోప‌తి మీ అస్థిత్వానికి, మీ వ్య‌క్తిత్వానికి  న‌ష్టాన్ని చేకూర్చుతాయి...!
ఇవ‌న్నీ వ‌ద్దు ఐదేళ్ల అధికార‌మే ముద్దు అనుకుంటే ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు.. మేం దీర్ఘ‌కాలం తెలంగాణ‌కు ర‌క్ష‌ణ‌గా నిలిచే వారిని కోరుకుంటున్నాం.. తెలంగాణ‌ను భ‌క్షించే వారి ప‌క్షాన నిలిచేవారిని మాత్రం కాదు..!!

--------------------
నోట్‌:  మీరు మాట్లాడే మాట‌లు తెలంగాణ ప్ర‌జ‌లే కాదు ఆంధ్రా ప్ర‌జ‌ల‌కూ, రాజ‌గురువు ఉద్యోగుల‌కే రుచించ‌డం లేదు... !!

No comments:

Post a Comment