1

1

Friday 2 January 2015

అర్థం కాని లాజిక్కు...

-----------
విశ్వ‌రూపం స‌మ‌యంలో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఆ సినిమాను అడ్డుకుంది.. ముస్లిం సంఘాలు వ్య‌తిరేకించ‌డం వ‌ల్ల క‌మ‌ల్ హాస‌న్ క్ష‌మాప‌ణ చెప్పాడు అని కొంద‌రు మిత్రులు నాతో అంటున్నారు..
మ‌రి త‌మిళ‌నాడులో ముస్లింల జ‌నాభా అతి త‌క్కువ. ఆ రాష్ట్రంలో మిన‌హా ముస్లింల జ‌నాభా అధికంగా ఉన్న ఇత‌ర రాష్ట్రాల్లో ఆ సినిమా విడుద‌ల‌కు పెద్ద‌ ఆటంకాలు ఎదురు కాని విష‌యం మీకు తెలియ‌దా?
ఇక క‌మ‌ల్ హాస‌న్ న‌టుడిగా క్ష‌మాప‌ణ చెప్పాడా? ముమ్మాటికీ కాదు, ఆయ‌న ఆ సినిమాకు ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, అలాగే హీరో కూడా...
అందుకే ఆయ‌న క్ష‌మాప‌ణ చెప్పాడు...
---------------------
మ‌రి పీకే సినిమా ద్వారా నిజంగా మీ మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయ‌ని భావిస్తే... త‌మిళ‌నాడు త‌ర‌హాలో మ‌హారాష్ట్ర‌లో ప్ర‌భుత్వం చేత, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల చేత‌ ఆ సినిమా విడుద‌ల‌ను ఆపేయించొచ్చు క‌దా... ఉల్టా ముఖ్య‌మంత్రి ఫ‌డ్న‌విస్ ఆ సినిమా ప్ర‌ద‌ర్శిస్తున్న థియేట‌ర్ల‌కు పోలీసు భ‌ద్ర‌త‌ను కూడా క‌ల్పిస్తాడు... కేవ‌లం బీజేపీ అధికారంలో లేని రాష్ట్రంలోనే గొడ‌వ‌లు ఎక్కువ‌గా చేయ‌డం దీని వెన‌క ఉద్దేశ‌మా? ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టేలా, శాంతి భ‌ద్ర‌త‌లు దెబ్బ‌తినేలా చూడ‌టం మీ ఆలోచ‌నా?
క్ష‌మాప‌ణ‌లు ద‌ర్శ‌కుడు, నిర్మాత నుంచి కోర‌వ‌చ్చు క‌దా... అది కాకుండా న‌టుడిని కోరడం ఏంటి?
ఆ న‌టుడు మీకు న‌చ్చిన వాడైతే మ‌ళ్లా సైలెంట్‌గా ఉండిపోతారా?

No comments:

Post a Comment