1

1

Thursday, 22 January 2015

కొండ‌ల‌న్నింటినీ నాశ‌నం చేసి హ‌రిత హారాలు చేస్తే ప్ర‌యోజ‌నాలు ఉంటాయా?

ఓ చిన్న సందేహం...
---------------
కొండ‌ల‌న్నింటినీ నాశ‌నం చేసి హ‌రిత హారాలు చేస్తే ప్ర‌యోజ‌నాలు ఉంటాయా?
మ‌న అవ‌స‌రం మేర‌కు గ్రానైట్ వాడుకోవాలి కానీ... ప్ర‌పంచానికి ఎగుమ‌తులు చేసేంత‌గా కొండ‌ల‌ను పిండి చేస్తే భ‌విష్య‌త్తుకు న‌ష్టం కాదా?
ఎన్ని ల‌క్ష కోట్లు ఇచ్చినా కొండ‌లు, గుట్ట ల‌ను సృష్టించ‌లేం క‌దా...
మాన‌వులు ఏదో ఒక రోజు ఇలా కొండ‌ల‌ను నాశ‌నం చేస్తార‌ని భ‌గ‌వంతుడు ఆలోచించాడేమో...
అందుకే కొండ‌ల్లో కొలువై... క‌నీసం కొన్ని కొండ‌ల జోలికైనా మాన‌వులు రాకుండా నిరోధించిన‌ట్లు అనిపిస్తుంది అప్పుడ‌ప్పుడు..
గాలి జ‌నార్ద‌న్ రెడ్డి లాంటోళ్లు సుంకుల‌మ్మ‌ ఆల‌యాన్ని పేల్చేసి మ‌రీ గ‌నుల త‌వ్వ‌కం చేశారు..
ఇక క‌రీంన‌గ‌ర్‌లో అయితే మ‌న అస్థిత్వానికి ఆనావాలుగా నిలిచిన బొమ్మ‌ల‌మ్మ గుట్ట‌లోనూ చ‌రిత్ర‌క సంప‌ద‌ను నాశ‌నం చేశారు..
రేపు డ‌బ్బులొస్తాయంటే భువ‌న‌గిరి కొండ‌ను కూడా గ్రానైట్ వ్యాపారుల‌కు అప్ప‌గిస్తారా?
సిద్ధుల గుట్ట‌ను కూడా పైస‌ల కోసం పిండి చేస్తారా?
అస‌లు ఎందుకు ఈ కొండ‌ల‌ను పిండి చేయ‌డం... అవే క‌దా మేఘాల‌ను అడ్డుకుని వ‌ర్షించేలా చేస్తాయి క‌దా...!
గిరిజ‌నుల‌కు ఉపాధినిస్తాయి క‌దా... మ‌నం ఉండ‌టానికి ఇళ్లులున్నాయి... మ‌రి జంతు జాలానికి ఆవాసం ఉండొద్దా..?
ఈ కొండ కోన‌ల్లోనే క‌దా గోదావ‌రి, కృష్ణ‌మ్మ‌లు ఉద్భ‌వించింది... న‌దుల్లోకి వ‌చ్చే చిన్న చిన్న నీటి పాయ‌లు కూడా ఈ కొండ‌ల నుంచి మొద‌ల‌య్యేవి క‌దా..
రేపు ఈ కొండ‌లే లేకుండా ప‌రిస్థితి ఏంటి?

1 comment:

  1. ఆశ!దురాశ!
    దుఃఖమునకు చేటు?!

    ReplyDelete